వృద్ధుడి సంచిలో పసికందు..ఆటో డ్రైవర్ కు అనుమానం రావడంతో..?

ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ( NTR district )కొండపల్లిలో చోటు చేసుకున్న దారుణ ఘటన అందరిని కలచివేసింది.రోజులు కూడా నిండని, బొడ్డుతాడు కూడా ఇంకా తెగిపోని ఒక పసికందును ఓ వృద్ధుడు సంచిలో తీసుకెళ్తూ అడ్డంగా దొరికిపోయాడు.

 Baby In Old Man's Bag Auto Driver Got Suspicious Crime News, Ntr District, And-TeluguStop.com

పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ పసికందును ఎక్కడికి తీసుకెళ్తున్నాడు.

ఆ పసికందును తీసుకెళ్లి ఏం చేయాలనుకుంటున్నాడు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి జంగారెడ్డిగూడెం( Jangareddygudem ) కు చెందిన ఓ మహిళ ఇటీవలే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.పుట్టిన ఇద్దరు పిల్లలతో ఒక పసికందు ఆరోగ్యం బాగాలేదని వైద్యులు గుర్తించారు.అయితే ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక నర్సు సహాయంతో ఓ ముసలి వ్యక్తికి ఆ పసికందును అప్పగించారు.

ఆ వృద్ధుడు పసికందును ఓ సంచిలో పడుకోబెట్టుకొని తీసుకెళ్లే క్రమంలో ఓ ఆటో ఎక్కాడు.

అయితే ఆ పసికందు గుక్క పట్టి ఏడవడంతో వెంటనే ఆటో డ్రైవర్( Auto driver ) కు అనుమానం వచ్చి ఆటో పక్కకు ఆపి ఆ వృద్ధుడి సంచిని తనిఖీ చేశాడు.ఆ సంచిలో పసికందును చూసి ఒక్కసారిగా షాక్ కు గురై, వెంటనే 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ పసికందును ఎక్కడికి తీసుకెళ్తున్నాడు.తీసుకెళ్లిన తర్వాత ఆ పసికందును ఏం చేయాలనుకుంటున్నాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube