వృద్ధుడి సంచిలో పసికందు..ఆటో డ్రైవర్ కు అనుమానం రావడంతో..?
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ( NTR District )కొండపల్లిలో చోటు చేసుకున్న దారుణ ఘటన అందరిని కలచివేసింది.
రోజులు కూడా నిండని, బొడ్డుతాడు కూడా ఇంకా తెగిపోని ఒక పసికందును ఓ వృద్ధుడు సంచిలో తీసుకెళ్తూ అడ్డంగా దొరికిపోయాడు.
పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ పసికందును ఎక్కడికి తీసుకెళ్తున్నాడు.
ఆ పసికందును తీసుకెళ్లి ఏం చేయాలనుకుంటున్నాడు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.
"""/" /
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి జంగారెడ్డిగూడెం( Jangareddygudem ) కు చెందిన ఓ మహిళ ఇటీవలే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.
పుట్టిన ఇద్దరు పిల్లలతో ఒక పసికందు ఆరోగ్యం బాగాలేదని వైద్యులు గుర్తించారు.అయితే ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక నర్సు సహాయంతో ఓ ముసలి వ్యక్తికి ఆ పసికందును అప్పగించారు.
ఆ వృద్ధుడు పసికందును ఓ సంచిలో పడుకోబెట్టుకొని తీసుకెళ్లే క్రమంలో ఓ ఆటో ఎక్కాడు.
"""/" /
అయితే ఆ పసికందు గుక్క పట్టి ఏడవడంతో వెంటనే ఆటో డ్రైవర్( Auto Driver ) కు అనుమానం వచ్చి ఆటో పక్కకు ఆపి ఆ వృద్ధుడి సంచిని తనిఖీ చేశాడు.
ఆ సంచిలో పసికందును చూసి ఒక్కసారిగా షాక్ కు గురై, వెంటనే 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు.ఆ పసికందును ఎక్కడికి తీసుకెళ్తున్నాడు.
తీసుకెళ్లిన తర్వాత ఆ పసికందును ఏం చేయాలనుకుంటున్నాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్16, సోమవారం 2024