దేవి నాగవల్లిపై మరోసారి బాబు గోగినేని సెటైర్లు.. పిచ్చి వేషాలు అంటూ?

టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి పై సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయో మనందరికీ తెలిసిందే.ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు వరకు కూడా సోషల్ మీడియాలో ఈమె పై విపరీతమైన ట్రోలింగ్స్ చేసేవారు.

 Babu Gogineni Shares Devi Nagavalli Old Dance Video On Road , Babu Gogineni , Ba-TeluguStop.com

అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత దేవి నాగవల్లి పై పాజిటీవిటి ఏర్పడింది.ఆ తర్వాత ఆమె పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం చాలావరకు తగ్గించేశారు.

కానీ తాజాగా ఆమె హీరో విశ్వక్ సేన్ విషయంలో ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలను గుప్పించడమే కాకుండా, ఆమె పై నెటిజన్స్ భారీగా ట్రోల్స్ చేశారు.

అయితే గత నాలుగైదు రోజులుగా యాంకర్ దేవి నాగవల్లి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు హీరో విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలుస్తూ దేవి నాగవల్లి ని ఏకిపారేశారు.ఇదే విషయంలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా ఎంట్రీ ఇచ్చి టీవీ9 మీడియాని ఏకిపారేశాడు.

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ కంటెస్టెంట్, ప్రముఖ హేతువాది అయిన బాబు గోగినేని కూడా వరుసగా పోస్ట్ లు చేస్తున్నాడు.ఈ క్రమంలోనే తాజాగా దేవి నాగవల్లి రోడ్డు పై చిందులు వేస్తున్న వీడియోని షేర్ చేసి ఆమెపై విమర్శలు గుప్పించాడు.

విశ్వక్ సేన్ రోడ్డుపై ఫ్రాంక్ వీడియో చేశాడు అని నువ్వు అంత రాద్ధాంతం చేశావు కదా? మరి నువ్వు చేసేది ఏంటి అన్నట్టుగా కౌంటర్ వేసాడు.మరి నువ్వు నడిరోడ్డుపై పిచ్చిపిచ్చి వేషాలు వేస్తుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది యాక్సిడెంట్ లు కూడా కావచ్చు.అంటూ దేవి నాగవల్లి పై కౌంటర్లు వేసాడు బాబు గోగినేని.అంతే కాకుండా మరొక వీడియోని కూడా షేర్ చేస్తూ దేవి నాగవల్లి పై సెటైర్లు వేశాడు బాబు గోగినేని.

బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు, న్యూటన్ లకు ఎవరికీ లేని అవగాహన ప్రపంచ చరిత్రలోనే విశ్వం గురించి ప్రథమంగా ఒక న్యూస్ ఛానల్ లో ఆవిష్కరించబడిన అద్భుత సత్యం.నీటిలో ఉన్న విద్యుత్ శక్తికి భూమి యొక్క ఆకర్షణ శక్తి గల సంబంధాన్ని అవలీలగా వివరిస్తూ వార్త అందిస్తున్న మానసిక వైద్య నిపుణురాలు జర్నలిస్ట్ దేవిగారు అంటూ రాసుకొచ్చారు బాబు గోగినేని.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube