Simhadri Chandrasekhar Rao : అవనిగడ్డ వైసీపీ ఇంచార్జ్ సింహాద్రి చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు..!!

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను వైసీపీ అధినేత జగన్( YCP Leader Jagan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.175 కి 175 నియోజకవర్గాలలో వైసీపీ గెలవాలని టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది.ఇదే సమయంలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో పలు సర్వేలు చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత, క్యాడర్ లో వ్యతిరేకత ఉన్న వారిని నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు.

 Avanigadda Ycp Incharge Simhadri Chandrasekhara Rao Sensational Comments-TeluguStop.com

ఇదే సమయంలో ఇంచార్జ్ ల మార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ రకంగా ఇప్పటికే ఆరు జాబితాలు విడుదల చేసి 60కి పైగా అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గలకి సంబంధించి ఇంచార్జ్ ల మార్పులు చేయటం మాత్రమే కాదు కొంతమందికి స్థానచలనం కల్పించారు.ఇదిలా ఉంటే అవనిగడ్డ వైసీపీ ఇంచార్జ్ గా ఎంపికైన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు( Simhadri Chandrasekhar Rao ) సోమవారం సీఎం జగన్ తో సమావేశమయ్యారు.ఈ సమావేశం అనంతరం సింహాద్రి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.“నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.నా వయసు రిత్యా కుమారుడు సింహాద్రి రామ్ చరణ్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాం.

వచ్చే ఎన్నికలకు సంబంధించి అతడే ప్రతి గడపకు తిరుగుతారు.వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేస్తారు.

వచ్చే ఎన్నికలలో నా కుమారుడని ఆశీర్వదించాలని కోరుతున్నా” అని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube