అలేరులో ఆటో డ్రైవర్ల భిక్షాటన

యాదాద్రి భువనగిరి జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని యాదాద్రి భువనగిరి జిల్లా ఆటో డ్రైవర్ల యూనియన్ (టిఏటియు) జిల్లా సెక్రటరీ శవ్వా సంతోష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆటో సంఘాల అధ్యర్యంలో ఆలేరు పట్టణంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు స్థానిక బస్టాండు అవరణంలోని మెయిన్ రోడ్ లో వాణిజ్య సముదాయాల వద్దకు వెళ్ళి భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు.

 Auto Drivers Protest By Begging In Aleru, Auto Drivers, Auto Drivers Protest ,au-TeluguStop.com

ఈ కార్యక్రమానికి సిపిఐ యాదాద్రి జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్, పెరపు రాములు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కొరకొప్పుల అంజయ్య ఎండీ గౌస్,గాజుల చంద్రయ్య,ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube