పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలైన విషయం తెలిసిందే.కాగా నందిగ్రాం లో పోటి చేసిన మమత మొదటి నాలుగు రౌండ్లు పూర్తయ్యే సమయంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే 8,000 ఓట్ల వెనుకంజలో ఉండగా, అనంతరం రౌండ్లలో మాత్రం ఆమె అనూహ్యంగా పుంజుకున్నారు.
కానీ చివరికి స్వల్ప ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి, మమతపై విజయం సాధించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఈ గెలుపే గొడవలకు దారితీసింది.
మమతపై విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కారుపై రాళ్ల దాడి జరిగింది.సువేందు అధికారి ఈసీ కార్యాలయం నుండి గెలుపు పత్రాన్ని తీసుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఆయన కారుపై దుండగులు రాళ్లతో విరుచుకుపడ్డారట.
ఇదే సమయంలో అరామ్ బాగ్ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు.మొత్తానికి బీజేపీ విజయం వివాదాలకు దారి తీసిందని అనుకుంటున్నారట.