దళితుల పట్ల సమాజంలో ఎక్కడో ఒక చోట ఇప్పటికీ వివక్ష జరుగుతోంది.గతంలో అంటరానితనం విరాజిల్లింది.
చాలా మంది దళితులను అంటరానివారిగా భావించి అనేక కఠిన నిబంధనలను విధించేవారు.రాను రాను ఆ పద్దతులు పోయాయి.
అయితే ఇప్పుడు కూడా అంటరానితనం, కుల వివక్ష వంటి కొనసాగుతున్నాయి.అవి వాటి రూపాన్ని మార్చుకుని సమాజంలో దర్జాగా నిలుస్తున్నాయి.
కులం పేరుతో హత్యలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.కులం పేరుతో అతి దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
దళితులు ఏదన్నా తప్పు చేస్తే చాలు వారిని గ్రామం నుంచి వెలివేయడం జరుగుతోంది.తాాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
ఒక సర్కార్ ఉద్యోగి చేత కాళ్లు మొక్కించుకున్న ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.
కులం పేరు చెప్పి ఆ సర్కార్ ఉద్యోగిని ఘోరంగా హేళన చేశారు.అవమానించారు.
కోయంబత్తూర్ లోని అన్నూర్ పంచాయితీలో ఈ దారుణం జరిగింది.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ముత్తుస్వామిని అనే వ్యక్తి ఓ అహంకారంతో తన కాళ్లమీద పడి సారీ చెప్పాలని బెదిరింపులకు పాల్పడ్డాడు.
దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.దీనిపై ఆ జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యాడు.
వెంటనే విచారణ చేయాలని చెప్పాడు.అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు.
ల్యాండ్స్ విషయమై గోపాలస్వామి అనే వ్యక్తి పంచాయతీ ఆఫీసుకు వెళ్లాడు.

ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి ఓ ప్రభుత్వ ఉద్యోగితో అవమానకర రీతిలో మాట్లాడాడు.మాటలు ఎక్కువయ్యాయి.ఆ తర్వాత ముత్తుస్వామి, గోపాలస్వామిల ఇద్దరి మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది.
ముత్తుస్వామి ఓ దళిత వ్యక్తి అని కులం పేరు చెప్పి గోపాలస్వామి అవమానించాడు.అంతేకాకుండా తన కాళ్ల మీద సారి చెబితే క్షమించి వదిలేస్తానని, లేకుంటే ఉద్యోగం తీయించేస్తానని బెదిరించాడు.
దీంతో ఆ ప్రభుత్వ ఉద్యోగి అతని కాళ్ల మీద పడి సారీ చెప్పాడు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.