టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారే లేరు.ఇక ఈయనకు ఉన్న అభిమానులు మాత్రం అంతా ఇంతా కాదు.
బాలనటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మారి స్టార్ హీరోగా ఎదిగాడు.ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారనున్నాడు.
డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.ఇందులో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటించాడు.
ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా ఈ సినిమా బృందం గత కొన్ని రోజుల నుండి ప్రమోషన్స్ భాగంలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

ఇక తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్.సంగీతం డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణితో చిట్ చాట్ చేయగా ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.అందులో కీరవాణి.
ఎన్టీఆర్ తో.మీరు ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు.నైట్ ఫోన్ ను సైలెంట్ మోడ్ లో పెట్టి పడుకున్నారు.ఉదయం లేచేసరికి రాజమౌళి, కార్తికేయ, శ్రీవల్లి, డివివి దానయ్య మిస్డ్ కాల్స్ ఉన్నాయి.

ముందుగా దేన్ని అటెండ్ అవుతారు అని ప్రశ్నించాడు.దీంతో వెంటనే ఎన్టీఆర్ శ్రీవల్లి పేరు చెప్పటం తో.అంటే తిడుతుందనా అని కీరవాణి సరదాగా అనటంతో.వెంటనే ఎన్టీఆర్.
కాదు మా అమ్మ తరువాత ఆమెనే అమ్మ అని పిలుస్తాను నేను.తిట్టడం అంటే నన్ను తిట్టే హక్కు ఇద్దరు ఆడ వాళ్ళకే ఉంది.
వాళ్ళిద్దరు రమ గారు, శ్రీ వల్లమ్మ.అమ్మ పెద్దగా తిట్టేది కాదు.
కానీ ఈ మధ్య పెళ్ళాం ముందు పెట్టడం ఎందుకు అనేమో ఆ కాస్త కూడా మానేసింది అని చెప్పుకొచ్చాడు.