పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు..!!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావునీ నియమించటం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.

 Ap Press Academy Chairman Kommineni Srinivasa Rao Visited The Polavaram Project-TeluguStop.com

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని అన్నారు.పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల జీవనాడి అని అన్నారు.

అనంతరం పోలవరం ప్రాజెక్టు సందర్శించడం మంచి అనుభూతిని కలిగించిందని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే మరోపక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువులో పోలవరం పూర్తి కావడం కష్టమని ఇటీవల స్పష్టం చేయడం జరిగింది.

రాజ్యసభలో వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ స్పందించి.షెడ్యూల్ ప్రకారం 2024 మార్చినాటికి పూర్తి కావాల్సి ఉంది.

కానీ వివిధ కారణాల వల్ల నిర్ణీత గడువు లాగా పోలవరం పూర్తి చేయడం కష్టమని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube