YCP Final List :వైసీపీ ఫైనల్ లిస్ట్ వచ్చేస్తోంది.. ఎప్పుడు ఎక్కడ ప్రకటించబోతున్నారంటే ? 

ఇప్పటికే విడతల వారీగా కొన్ని కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేస్తూ,  కొన్నిచోట్ల మార్పు చేర్పులు చేస్తూ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తూ వస్తున్న వైసిపి అధినేత,  ఏపీ సీఎం జగన్ ( AP CM YS Jagan )ఇక ఫైనల్ లిస్టును విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఫైనల్ లిస్టు తో పాటు , ఎన్నికల మేనిఫెస్టోను ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనతో జగన్ ఉన్నారు.

 Ap Cm Ys Jagan To Release Ysrcp Mla Candidate Final List 2024-TeluguStop.com

ఈనెల 16న 175 అసెంబ్లీ,  25 పార్లమెంట్ అభ్యర్థుల ఫైనల్ జాబితా( Assembly Parliamnet Candidates List )ను ప్రకటించనున్నారు.ఈ ప్రకటన తర్వాత మేనిఫెస్టో( YCP Manifesto )ను విడుదల చేసి పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి పార్టీ శ్రేణులను జగన్ తీసుకువెళ్లనున్నారు.

పూర్తిగా ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు నిమగ్నం అయ్యేవిధంగా పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ ను రూపొందించారు.ఈ మేరకు ఆశావాహులు,,  అసంతృప్తలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.

Telugu Apcm, Ap, Chandrababu, Janasena, Janasenani, Pawan Kalyan, Telugudesam, Y

కొన్ని నియోజకవర్గాల విషయంలో పార్టీ ప్రకటించిన అభ్యర్థుల స్థానాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉండడంతో,  అసంతృప్త నేతలను పిలిపించి చర్చిస్తున్నారు.మరి కొంతమందికి పదవుల హామీ ఇస్తూ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని , ఇప్పుడు మార్పు చేర్పుల విషయమై తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని జగన్ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఈనెల 16న పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసి అదే రోజున ఇడుపులపాయలో జగన్ పర్యటించి తన తండ్రి వైఎస్సార్ ఘాటు( YSR Ghat ) వద్ద తుది జాబితాను విడుదల చేయనున్నట్లు వైసిపి వర్గాలు పేర్కొన్నాయి.

Telugu Apcm, Ap, Chandrababu, Janasena, Janasenani, Pawan Kalyan, Telugudesam, Y

ఈ ఫైనల్ జాబితాలో ఎంతమంది సిట్టింగులు మళ్లీ అవకాశం దక్కించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో ఆశావాహులు ,  సిట్టింగ్ ఎమ్మెల్యే ల్లో టెన్షన్ నెలకొంది. టిడిపి, జనసేన,  బిజెపి( TDP Janasena BJP Alliance ) ఉమ్మడిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ,తమ ఓటమే టార్గెట్ గా అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్న నేపథ్యంలో,  ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లి అన్ని స్థానాల్లోనూ గెలవాలి అనే పట్టుదలతో జగన్ ఉన్నారు.దానికి అనుగుణంగానే నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube