అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కామెంట్స్.22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్య లో ఆవిష్కృతం అవుతుంది.రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటం.ఈనెల 22న బాలరామని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారు.22వ తేదీన దేశం మొత్తం చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు.ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆ రోజు సెలవు ప్రకటించలేదు.రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వల్ల 21 వరకు సెలవు ఇవ్వడాన్ని బిజెపి పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి మోడీ చేయూతను ఇచ్చారు.22న బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.21 వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక ప్రభుత్వం దురుద్దేశం ఉందని అర్థం అవుతుంది.22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఉద్దేశిపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదు.ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి.అయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఎపి ప్రభుత్వం 22న సెలవు ప్రకటించాలని బిజెపి రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది.