అనిల్ రావిపూడి నెక్స్ట్ టార్గెట్ ప్రభాస్... అంతేగా

టాలీవుడ్ లో ఫెయిల్యూర్ లేని దర్శకుడుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి.వరుసగా ఆరు హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న అనిల్ ఇప్పుడు స్టార్ దర్శకుడుగా మారిపోయాడు.

 Anil Ravipudi Plan To Movie With Prabhas-TeluguStop.com

ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి అని అనిపించుకున్నాడు.కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో కథని చెప్పడంలో అనిల్ తన మార్క్ చూపిస్తున్నాడు.

ఇప్పుడు స్టార్ట్ హీరోలు కూడా అనిల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇదిలాఉంటే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుని దర్శకత్వం చేసే ఛాన్స్ కొట్టేసి అతనికి దూకుడు తరహాలో సూపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇదే స్పీడ్ తో నెక్స్ట్ మరో పెద్ద హీరోతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.సరిలేరుతో వంద కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు తన కమర్షియల్ రేంజ్ ని మరింత పెంచి బాలీవుడ్ కి కూడా పరిచయం చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

దీనికోసం ప్రభాస్ కి సరిపోయే ఓకే సూపర్ స్టొరీ సిద్ధం చేసే పనిలో పడ్డట్లు సమాచారం.అయితే ఎఫ్ 3 సినిమా కూడా ఉంటుందని ఇప్పటికే చెప్పిన ఈ దర్శకుడు దీనిని ముందు సెట్స్ పైకి తీసుకెళ్తాడా లేకా ప్రభాస్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube