టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Naidu arrest )తలందరిది ఒకే ఎజెండా అదే అధినేత చంద్రబాబును బయటకు తీసుకురావడం.కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే బెయిల్ ఇప్పుడే వచ్చేలా కనిపించడంలేదు.
దాంతో పార్టీ కార్యక్రమాలు ఆపడం సరైనది కాదని భావిస్తున్న టీడీపీ అగ్రనేతలు త్వరలోనే ప్రజల్లోకి వెళ్ళేందుకు మార్గాలను వెతుక్కుంతున్నారు.గతంలో భవిష్యత్ గ్యారెంటీ పేరుతో చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే కార్యక్రమాన్ని నారా లోకేశ్( Nara Lokesh ) చేపట్టనున్నట్లు తెలుస్తోంది.అలాగే నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari )కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారట.చంద్రబాబు అరెస్ట్ జీర్ణించుకోలేక చనిపోయిన కుటుంబాలను పరమర్శిస్తూ.రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారట.వారానికి కనీసం రెండు లేదా మూడు చోట్ల ఆమె పర్యటనలు ఉండేలా టీడీపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నారు.ఇక లోకేష్ యువ గళం( Nara Lokesh Yuva Galam ) పేరుతో చేపట్టిన పాదయాత్రను బస్సు యాత్రగా మార్చి నారా బ్రహ్మణి( Nara Brahmani ) చే యాత్ర చేయించేలా ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇలా టీడీపీ శ్రేణులతో పాటు నారా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండేలా భవిష్యత్ కార్యక్రమాలను రూపొందిస్తున్నారట.ఈ కార్యక్రమాలన్నీటి యొక్క ముఖ్య ఎజెండా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం.అలాగే సిఎం జగన్ చేస్తున్న అక్రమ పాలన గురించి ప్రజలకు వివరించడం.మరి టీడీపీ( TDP ) చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల్లో ఎంతమేర ప్రభావం చూపుతాయో అనేది ఆసక్తికరం.
చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి సానుభూతిగా మారుతుందని, తెలుగు తమ్ముళ్ళు బలంగా భావిస్తున్నారు.అందుకే అరెస్ట్ అంశాన్నే ప్రధాన అస్త్రంగా వాడుకునేందుకు టీడీపీ సిద్దమౌతోంది.మరి ప్రజలు టీడీపీపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.