ఒకప్పుడు స్టార్ సెలబ్రిటీ కిడ్స్ మొదటి సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ దంచి కొట్టేవి.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అసలు కనిపించడం లేదు.
సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు నచ్చకపోతే పెద్ద పెద్ద సూపర్ స్టార్ సినిమాలను కూడా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్న రోజులు ఇవి.అలాంటిది వారసుల సినిమాలను ఎలా ప్రోత్సహిస్తారు చెప్పండి.సరిగ్గా యాంకర్ సుమ కొడుకు రోషన్ కి( Roshan Kanakala ) కూడా ఈరోజు అలాంటి పరిస్థితి ఏర్పడింది.ఆయన హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన ‘బబుల్ గమ్’ ( Bubblegum Movie ) అనే సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది.
సినిమాని చూసిన ఆడియన్స్ పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు, రోషన్ కనకాల కి ఇది మొదటి సినిమా లాగ చూసే ఆడియన్స్ కి అనిపించలేదు.చాలా చక్కగా నటించాడు, ప్రతీ హావభావం పర్ఫెక్ట్ గా వెండితెర మీద పండింది అనే టాక్ వచ్చింది.

అయినప్పటికీ కూడా ఆడియన్స్ ఈ సినిమాని చూసేందుకు థియేటర్స్ కి కదలలేదు.పాపం సుమ( Suma Kanakala ) కొడుకు బాగా కస్టపడి చేసాడు కానీ, ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయి రెస్పాన్స్ అయితే రాబట్టలేకపోయాడు.ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజులు కేవలం 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయని తెలుస్తుంది.అంటే షేర్ అందులో సగం ఉండొచ్చు, కానీ ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో ప్రీమియర్ షోస్ వేశారు.
ఈ షోస్ అన్ని ఫుల్ అయ్యాయి.ఆ ప్రీమియర్ షోస్ ని( Premier Shows ) కూడా కలిపితే మరో 15 లక్షల రూపాయిల గ్రాస్ వస్తుంది.
ఓవరాల్ గా 65 లక్షల రూపాయిల గ్రాస్ అన్నమాట.మొదటి రోజు ఓపెనింగ్ ఆశాజనకంగా లేకపోయినా సినిమా లో కంటెంట్ ఉంది కాబట్టి కచ్చితంగా లాంగ్ రన్ ఉండొచ్చు అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

ఈ సినిమాకి ఓపెనింగ్ రాకపోవడానికి ఒక విధంగా టైటిల్ కూడా కారణం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇలాంటి టైటిల్స్ ని మన తెలుగు ఆడియన్స్ అసలు ప్రోత్సహించరు.ఒకవేళ టైటిల్ ని మార్చి ఈ సినిమాని తీసి ఉంటే కచ్చితంగా మంచి ఓపెనింగ్ వచ్చేది అని అంటున్నారు .ఇదంతా పక్కన పెడితే సుమ కొడుకు రోషన్( Suma Son Roshan ) కచ్చితంగా హీరో మెటీరియల్ అని ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి అర్థం అవుతుంది.నటన చాలా బాగుంది, హావభావాలు చాలా చక్కగా, అనుభవం ఉన్న నటుడిగా పండించాడు.ఈ సినిమా కాకపోతే మరో సినిమాతో అయినా రోషన్ కి సూపర్ హిట్ ని కొట్టి ఇండస్ట్రీ లో స్థిరపడగల సత్తా ఉందని అంటున్నారు చూడాలి మరి.