యాంకర్ ప్రదీప్ ఖాతాలో మరో రికార్డు... దుమ్ము లేపిన పాట

తెలుగు టెలివిజన్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్. ఫిమేల్ యాంకర్స్ లో సుమ నెంబర్ వన్ స్థానంలో ఉంటే మేల్ యాంకర్స్ లో ప్రదీప్ ఆ స్థానంలో కొనసాగుతున్నాడు.

 Anchor Pradeep Movie Song Cross 200 Million Views, Tollywood, 30 Rojullo Preminc-TeluguStop.com

ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న అన్ని చానల్స్ లో యాంకర్ ప్రదీప్ కి సంబందించిన షోలు ప్రసారం అవుతున్నాయి.అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న యాంకర్ గా తన ప్రస్తానం సాగిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ప్రదీప్ యాంకర్ గా చేస్తూనే నటుడుగా కూడా ఇప్పటి వరకు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు.అయితే మొదటి సారి సారి హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేశాడు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.అయితే కరోనా పరిస్థితుల కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా లో సిద్ శ్రీరామ్ ఆలపించిన నీలి నీలి ఆకాశం అనే గీతాన్ని ఎప్పుడో యుట్యూబ్ లో రిలీజ్ చేశారు.ఈ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

పెద్ద సినిమాల స్థాయిలో ఈ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోయింది.అతి తక్కువ సమయంలోనే మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి ఇప్పటికి కూడా అంతే స్పీడ్ గా దూసుకుపోతుంది.

ఇప్పటికే రికార్డు స్థాయిలో వ్యూస్‌ దక్కించుకున్న ఈ పాట తాజాగా యూట్యూబ్‌ 200 మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది.సౌతిండియాలో హీరో మొదటి సినిమాలోనే ఈ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్న సాంగ్ గా ఇది అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.

చంద్రబోస్‌ రాసిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌, సునీత పాడారు.మొత్తానికి సినిమా విడుదల కాకుండానే ఈ సాంగ్ ద్వారానే యాంకర్ ప్రదీప్ స్టార్ హీరో రేంజ్ లో యుట్యూబ్ లో సెన్సేషన్ అయిపోయాడని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube