బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమై వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నటువంటి అనసూయ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా హాజరవుతూ సందడి చేస్తున్నారు.
గత కొద్ది రోజుల క్రితం శ్రీకాళహస్తిలో ఒక షోరూం ప్రారంభోత్సవంలో సందడి చేసిన ఈమె తాజాగా కాకినాడలో సందడి చేశారు.
పెద్దాపురంలోని ఒక షోరూం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అనసూయ కాకినాడలో ఒక హోటల్ రూమ్లో బస చేశారు.
ఇక తమ జిల్లాకు ఎవరు వచ్చినా వారిని బాహుబలి కాజాతో సత్కరించడం సాంప్రదాయమని సురుచి పీఆర్వో వర్మ వెల్లడించారు.ఇదివరకు ఎంతోమంది తమ జిల్లాకు వచ్చినటువంటి వారికి బాహుబలి కాజాతో సత్కరించామని తెలిపారు ఈ క్రమంలోనే కాకినాడకు యాంకర్ అనసూయ రావడంతో ఆమెను శనివారం ఒక హోటల్లో కలిసినటువంటి సురుచి బాహుబలి కాజాతో ఆమెను సత్కరించారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అనసూయ ఇటీవల కాలంలో దర్జా, వాంటెడ్ పండు గాడ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయని చెప్పాలి.ప్రస్తుతం ఈమె పుష్ప 2,రంగమార్తాండ అనే సినిమాలలో బిజీగా ఉన్నారు.అదే విధంగా కన్యాశుల్కం అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం.