తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ నటి అనసూయ భరద్వాజ్( Anasuya Bharadwaj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం అనసూయ వెండితెరపై వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
మొన్నటివరకు బుల్లితెరపై యాంకర్ గా తన సత్తాను చాటిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై నటిగా వరుసగా అవకాశాలను అంటూ అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది.కేవలం పాత్రకు అధిక ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ మెప్పిస్తోంది.
ఈ మధ్యకాలంలో అనసూయ ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది.
కాగా పుష్ప,దర్జా లాంటి సినిమాలో నెగిటివ్ రోల్స్ లో నటించిన విషయం తెలిసిందే.ఐటమ్ సాంగ్ లో కూడా చేసింది.ఇది ఇలా ఉంటే మరోసారి బోల్డ్ రోల్ లో నటించబోతోంది అనసూయ.
కాగా అనసూయ తాజాగా నటిస్తున్న చిత్రం విమానం.ఈ సినిమాలో సుమతి అనే పాత్రలో నటించబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది.
నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాతో మీరా జాస్మిన్ మరోసారి తెలుగు ఆడియెన్స్ ని అలరించబోతోంది.
శివ ప్రసాద్ యానాల( Siva Prasad Yanala ) దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై విమానం చిత్రం తెరకెక్కుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అనసూయ పాత్రను రివీల్ చేశారు చిత్ర బృందం.ఇందులో అనసూయ ఒక ఎమోషనల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించనుంది.ఈ సినిమా జూన్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తాజాగా అనసూయ పాత్ర విడుదల చేయగా ఆ పాత్రను చూసిన చాలా మంది రంగమ్మత్త క్యారెక్టర్ కంటే మించి ఈ పాత్ర ఉండబోతోందని అర్థం అవుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు.