తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్( Tollywood ) పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కాగా గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడంతోపాటు ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ ( global star )గా కూడా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 100% షూటింగ్ పూర్తి అయ్యింది.ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్గా నటిస్తోంది.
రామ్ చరణ్ సినిమాలలో నటించడంతోపాటు తన తండ్రి చిరంజీవి ( Chiranjeevi )మాదిరి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ అభిమానులు చేసిన పని గురించి అందరూ చర్చించుకుంటున్నారు.తాజాగా చెర్రీ అభిమానులు మండువేసవిలో సేవ కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలిచారు.ముంబయిలోని అంధేరి , భీవండి, జుహూలోని శంకర్ ఆలయం పరిసరాల్లో దాదాపు 1000 మంది చెర్రీ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వేసవిలో ఎండ వేడిమిని తట్టుకునేందుకు దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ పాకెట్స్ పంపిణీ చేశారు.
తమ అభిమాన నటుడు చేసే సేవా కార్యక్రమాలను చూసి తాము స్ఫూర్తి పొందినట్లు వారు తెలిపారు.ఇక చెర్రీ ఫ్యాన్స్( Cherry fans ) చేసిన మంచి పనిని నెటిజన్స్ మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇకపోతే రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అసోసియేషన్ల ద్వారా, ఎన్జీవోల ద్వారా, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు చేయడంతో పాటు కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మందికి సహాయం చేసిన విషయం తెలిసిందే.
కోడలు ఉపాసన కూడా అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.