వైరల్: ఆఫ్రికన్ డ్యాన్స్‌ పోస్ట్ చేస్తూ, ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపిన ఆనంద్‌ మహీంద్రా!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఖచ్చితంగా చెప్పలేము.అది కూడా ఒక అదృష్టమే అనుకోవాలి.

 Anand Mahindra Shares New Year Wishes With African Dance Viral Video Details, Af-TeluguStop.com

ఇక అలాంటి వీడియోలు పట్టుకొని తన మనసుకి హత్తుకున్నవి మరలా మరలా వైరల్ ఎలా చూస్తారు మన టెక్ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా.ఆయన సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా వుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

ఆసక్తికరమైన పోస్టులు, వీడియోలు షేర్‌ చేస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఆయన 2022కి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఓ ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు.

సదరు వీడియోలో ఓ గిరిజన వ్యక్తి డాన్స్‌ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.అందులో ఎలాంటి భయం, తడబాటులేకుండా చాలా హృద్యంగా డ్యాన్స్‌ వేస్తున్న వ్యక్తిని చూడవచ్చు.

ఆ వీడియో చూడటానికి చాలా ఆహ్లాదంగా వుంది.ఓ డిఫెరెంట్ మ్యూజిక్ కి సదరు వ్యక్తి వేసిన స్టెప్స్ చూస్తే ఇలాంటి నేలపైనే కదా మైఖేల్ జాక్సన్ పుట్టాడు అని జ్ఞప్తికి వస్తుంది.

ఈ వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్టు చేస్తూ… “2022కి వీడ్కోలు పలుకుతూ నేను ఎంత ఆనందంతో డ్యాన్స్‌ చేయబోతున్నానో ఇక్కడ మీకు చూపిస్తున్నాను” అని రాసుకొచ్చారు.

అద్భుతం కదా.ఇంకా ఆయన… “ఈ ఏడాది ఉక్రెయిన్‌లో యుద్ధం, కొవిడ్‌ మళ్లీ ప్రబలడం లాంటి దారుణమైన ఘటనలు చూసాం.అయితే, అలాంటి విపత్తులను ఈ కొత్త సంవత్సరం సమర్థంగా ఎదుర్కోవాలి” అని కూడా ట్వీట్లో రాసుకొచ్చారు.

కాగా ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఇంకా దానికి నెటిజన్లు స్పందిస్తూ… ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడేందుకు అన్ని దేశాలూ కలిసి అడుగులు వేసే సమయం ఆసన్నం అయిందని కొంతమంది యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube