డాక్టర్లపై సెటైర్స్ వేసిన ఆనంద్ మహీంద్రా... వారి హ్యాండ్ రైటింగ్ వారికి తప్ప ఎవరికీ అర్ధం కాదు!

ఇలాంటి అనుభవం మనలో ప్రతిఒక్కరికీ ఉంటుంది.ఆసుపత్రిలో చెకప్‌ చేసుకున్నాక.

 Anand Mahindra Satires On Doctors Their Handwriting Is Not Understood By Anyone-TeluguStop.com

వైద్యులు ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌ చూసి మనం కాస్త అయోమయానికి గురవుతాము.యెంత చదువుకున్నవారికైనా డాక్టర్లు చేతిరాత అనేది అంతుచిక్కకుండా ఉంటుంది.

జీవితంలో ప్రతిఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు.దీంతో వైద్యుల ప్రిస్క్రిప్షన్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు జోకులు పేలుతూనే ఉంటాయి.

అయితే, ఆ రైటింగ్‌ ఎవరికీ అర్థం కాకపోయినప్పటికీ.సంబంధిత మెడికల్‌ షాపు వారికి మాత్రం ఆ చేతి రాత చాలా క్లియర్ గా అర్థం అవుతుంది.

ఆ సీక్రెట్ వారికే తెలియాలి మరి!.

ఇక అసలు విషయంలోకి వస్తే, సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉంటూ, అనేక విషయాలను పంచుకునే ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా.

తాజాగా వైద్యుల ప్రిస్క్రిప్షన్‌కు సంబంధించిన ఓ వీడియో పంచుకోగా అది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.విద్యార్థిగా చదువుకునే రోజుల నుంచి వైద్య నిపుణుడిగా ఎదిగేవరకు వారి చేతిరాతలో ఏవిధంగా మార్పులు చోటుచేసుకుంటాయో.

సరదాగా తెలియజేస్తున్న ఓ వీడియోను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు.

పదో తరగతి వరకు ఎంతో అందంగా రాసే ఆ విద్యార్థి.

ఆపై తరగతుల్లో అతడి చేతిరాత ఎలా మారుతూ వస్తుందో సదరు వీడియోలో చక్కగా చూపారు.ఇక ఎంబీబీఎస్‌, పీజీ, జూనియర్‌ వైద్యుడు, సీనియర్‌ వైద్యుడు, వైద్య నిపుణుడు.

ఇలా ఎదిగే కొద్దీ చేతిరాతలో ఎటువంటి మార్పు వస్తుందో అని సరదాగా చూపించారు.‘నవ్వులు పంచుతోంది.

కానీ ఇది నిజం’ అంటూ ఆనంద్‌ మహీంద్రా ఈ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేసారు.దాంతో అది వైరల్‌గా మారింది.

అనేకమంది అంతే సరదాగా కామెంట్లు చేస్తున్నారు.డాక్టర్లు ఎందుకు ఇలా రాస్తారు? అని కొందరు అనుమానం వ్యక్తం చేయగా, వారు కావాలనే అలా రాస్తారు.ఎందుకంటే సదరు ప్రిస్క్రిప్షన్ మనకు అర్ధం అయితే మనం మరలా డాక్టర్ దగ్గరకు వెళ్ళం కదా.! అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube