కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది.బిపర్ జోయ్ తుఫానుపై పర్యవేక్షిస్తుండటంతో రేపటి తెలంగాణ పర్యటనను అమిత్ షా వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.
కాగా అమిత్ షా పర్యటన వాయిదా పడటం ఇది నాలుగో సారి.అయితే పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభకు హాజరుకావడంతో పాటు పలువురు రాజకీయ, సినీ మరియు క్రీడా ప్రముఖులను కలిసే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే.
తదుపరి పర్యటన ఎప్పుడనే దానిపై పార్టీ వర్గాలు ఎటువంటి ప్రకటన చేయలేదని సమాచారం.