అమెరికా : చెత్త బుట్టలో మృతదేహం.. 35 ఏళ్ల తర్వాత మహిళదిగా గుర్తించిన అధికారులు

పోలం దున్నుతున్నప్పుడో, భవనాలకు పునాదులు తవ్వుతున్నప్పుడో మానవ శరీర అవశేషాలు, అస్థిపంజరాలు కనిపిస్తూ వుంటాయి.అవి ఎవరివో తేల్చేందుకు పోలీసులు శ్రమిస్తూ వుంటారు.

 America Dead Body In Garbage Basket Officials Identified It As A Woman After 35-TeluguStop.com

తాజాగా అమెరికాలో( America ) చెత్త బుట్టలో దొరికిన మృతదేహం ఎవరిదో తేల్చడానికి 35 ఏళ్లు పట్టింది.వివరాల్లోకి వెళితే.35 ఏళ్ల క్రితం డంప్‌స్టర్ (చెత్తబుట్ట)లో ప్లాస్టిక్‌తో చుట్టబడిన ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.డీఎన్ఏ టెస్ట్, ఇతర పరీక్షలతో అది మహిళదని, మృతురాలు దక్షిణ కొరియాకు( South Korea ) చెందిన వ్యక్తిగా తేల్చినట్లు అధికారులు సోమవారం ప్రకటించారు.

-Telugu NRI

జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( Georgia Bureau of Investigation ) (జీబీఐ) అధికారులు… ఫిబ్రవరి 1988లో మిల్లెన్ రూరల్ ప్రాంతంలోని డంప్‌స్టర్‌లో దొరికిన మృతదేహం 26 ఏళ్ల (అప్పటికి) చోంగ్ ఉన్ కిమ్‌గా( Chong Un Kim ) గుర్తించారు.ఈ డెడ్‌బాడీ ఆనవాళ్లు తెలుసుకోవడానికి ఎంతోమంది డీఎన్ఏ సీక్వెన్స్‌లు విశ్లేషించారు.ఆమె ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.అయితే ఆమెను ఎవరు చంపారు, మృతదేహాన్ని ఇక్కడ ఎవరు పడేశారన్నది మాత్రం నేటికీ మిస్టరీగానే వుంది.ప్లాస్టిక్, డక్ట్ టేప్‌తో కిమ్‌ను చుట్టి ఓ సూట్ కేస్‌లో కుక్కీ అనంతరం డంప్‌స్టర్‌లో పడేశారు.మృతదేహాన్ని పోలీసులు ఆ ప్రాంతంలో గుర్తించడానికి నాలుగు నుంచి ఏడు రోజుల ముందు కిమ్ ( Kim )మరణించి వుండొచ్చని పరిశోధకులు తెలిపారు.

-Telugu NRI

కిమ్ 1981లో అమెరికాకు వెళ్లినట్లు పరిశోధకులు, అధికారులు వెల్లడించారు.మిల్లెన్‌కు దక్షిణంగా 70 మైళ్ల దూరంలో వున్న ఫోర్ట్ స్టీవర్ట్‌ను ఆనుకుని వున్న హిన్స్ విల్లేలో ఆమె నివసించినట్లు దర్యాప్తులో తేలింది.వేలిముద్రలు, దంతాలు, ఫోరెన్సిక్ స్కెచ్‌ను ఉపయోగించినప్పటికీ పరిశోధకులు దశాబ్ధాలుగా కిమ్‌ను గుర్తించలేకపోయారు.ఇందుకోసం ఎంతోమంది డీఎన్ఏలను నిపుణులు విశ్లేషించారు.చోంగ్ ఉన్ కిమ్ గురించి తెలిసిన వారు, కేసు గురించి ఏదైనా సమాచారం కలిగి ఉంటే 912-871-1121లో ఏజెన్సీని సంప్రదించమని జీబీఐ కోరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube