పొత్తు ప్రకటించిన తర్వాత నిన్న మొట్టమొదటి ఉమ్మడి సమావేశం ని రాజమండ్రి లో టీడీపీ మరియు జనసేన పార్టీలు నిర్వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ సమావేశం లో టీడీపీ మరియు జనసేన పార్టీల నుండి ముఖ్య నేతలతో పాటుగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మరియు నారా లోకేష్( Nara Lokesh ) కూడా పాల్గొన్నారు.
సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో టీడీపీ – జనసేన కలిసి ఎలా పోరాటం చెయ్యబోతున్నాయి, రెండు పార్టీల నుండి ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి అనే దానిపై సుదీర్ఘ చర్చలు జరిపారు.అంతే కాదు 70 ఏళ్ళు పైబడిన చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అనే వ్యక్తిని నెల రోజుల పై నుండి అక్రమ కేసులలో అరెస్ట్ చేసి కనీసం బెయిల్ కూడా రాకుండా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ నేపథ్యం లో ఆయనకీ సంఘీభావం గా ఈ సమావేశం ని రాజమండ్రి లో ఏర్పాటు చేసినట్టు పవన్ కళ్యాణ్ తెలిపాడు.
ఇకపోతే తెలుగు దేశం పార్టీ లో ఉండే టాప్ 10 లీడర్స్ లో ఒకరు అచ్చం నాయుడు.( Atchennaidu ) పార్టీ కి వెన్నుముక లాగ ఉంటూ వస్తున్నా అచ్చం నాయుడు ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా పార్టీని వదలకుండా ఉన్నాడు.అలాంటి లీడర్ నిన్న సమావేశం లో వచ్చినప్పుడు ఎందుకో పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోలేదు అనిపించింది అందరికీ.మీటింగ్ హాల్ లోకి అడుగుపెట్టగానే పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ నాయకులందరినీ పలకరిస్తూ వెళ్ళాడు.
కానీ అచ్చం నాయుడు ని మాత్రం మిస్ చేసి ఆయన పక్కన ఉన్న వ్యక్తికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.పాపం అచ్చం నాయుడు ఆ సమయం లో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యినట్టు అనిపించింది.అచ్చం నాయుడు పై పవన్ కళ్యాణ్ గతంలో ఎలాంటి ఆరోపణలు చెయ్యలేదు.2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ వైజాగ్ లో భావన నిర్మాణ కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తూ ఒక భారీ బహిరంగ సమావేశం ఏర్పాటు చేసాడు.
ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ( TDP ) కూడా మద్దతు తెలిపింది.అంతే కాదు ఆ పార్టీ తరుపున కొంతమంది ముఖ్య నేతలు కూడా సపోర్టుగా వచ్చారు.వారిలో అచ్చం నాయుడు గారు కూడా ఒకరు.అలాంటి అచ్చం నాయుడుని పవన్ కళ్యాణ్ ఎందుకు నిన్న పెద్దగా పలకరించలేదు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.
సమావేశం పూర్తి అయిన తర్వాత అచ్చం నాయుడు స్వయంగా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ తో మాట్లాడే ప్రయత్నం చేసాడు.అప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఆయనని నవ్వుతూ పలకరించాడు.
కానీ అది కూడా ఎదో ఫార్మాలిటీ కోసం పలకరించినట్టుగానే జనాలకు అనిపించింది.