బాలీవుడ్ నటి అమీషా పటేల్( Bollywood Actress Ameesha Patel ) తాజాగా నటించిన చిత్రం గదర్ 2.తాజాగా విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.
అయితే సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు అమీషా పటేల్.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అందులో భాగంగానే తాజాగా ఆమె ఓటీటీ వ్యవస్థ( OTT Platform )పై ఆమె మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి.అయితే తాజాగా ఆ వ్యాఖ్యలపై అమీషా పటేల్ క్లారిటీ ఇచ్చింది.
ఈ సందర్బంగా అమీషా మట్లాడుతూ.ఓటీటీలకు సెన్సార్ లేకపోవడం వల్ల బోల్డ్ కంటెంట్( Bold Content ) ఎక్కువగా వస్తుంది.పిల్లలతో కలిసి వాటిలో వచ్చే వెబ్ సిరీస్‌లు( Web Series ), సినిమాలు చూడలేకపోతున్నాము.ఇలాంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి.ఇవి వారిపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.లేదంటే మీరు చైల్డ్ లాక్‌ను పెట్టుకోవాలని అన్నారు.
అయితే ఈ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని తాజాగా వెల్లడించారు.నేను మాట్లాడిన మాటలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు.
ఓటీటీలకు నేను వ్యతిరేకమని రాశారు.నేను అలా అనలేదు.
ఓటీటీ లో వచ్చే కంటెంట్‌లో ఎక్కువ శాతం కుటుంబమంతా చూడలేకపోతున్నామని చెప్పాను.
అసభ్యపదజాలం, హింసతో కూడిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయి.ఇంట్లో అన్ని తరాల వారు కలిసి చూసేలా ఆరోగ్యకరమైన చిత్రాలు రావాలని కోరుకున్నాను.ఇంటర్వ్యూలో కూడా అదే విషయాన్ని చెప్పాను.
అంతేకానీ, నేను ఓటీటీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు.సినిమాలను ఎంత ఇష్టపడతానో వెబ్ సిరీస్‌లనూ అంతే ప్రేమిస్తాను.
అలాంటి వాటిల్లో భాగం కావాలని కోరుకుంటాను.కాకపోతే తర్వాత తరానికి కూడా కుటుంబ వ్యవస్థపై( Family oriented Movies ) గౌరవం పెరిగేలా కంటెంట్ ఉండాలన్నది నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది అమీషా పటేల్.