మారుతున్న బిగ్ బాస్ లెక్కలు.. అమర్ దీప్ లేదా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో( Bigg Boss ) లెక్కలు మారుతున్నాయి.శివాజీపై( Shivaji ) బిగ్ బాస్ షో స్టార్టింగ్ సమయంలో ఉన్న స్థాయిలో ఇప్పుడు క్రేజ్ లేకపోవడం గమనార్హం.

 Amardeep Pallavi Prashant Bigg Boss Show Season 7 Winner Details, Amardeep, Pall-TeluguStop.com

అమర్ దీప్ లేదా పల్లవి ప్రశాంత్( Pallavi Prashant ) బిగ్ బాస్ విన్నర్ అంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.నిన్నటి ఎపిసోడ్ లో అశ్విని ( Ashwini ) ఎలిమినేట్ కాగా ఈరోజు ఎపిసోడ్ లో మాత్రం రతిక ( Rathika ) ఎలిమినేట్ కానున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నలుగురు లేడీ కంటెస్టెంట్లలో ఇద్దరు ఎలిమినేట్ కావడం గమనార్హం.

బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) పూర్తి కావడానికి మరో మూడు వారాల సమయం ఉండగా హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉండనున్నారు.

బిగ్ బాస్ టైటిల్ రేస్ కోసం గట్టి పోటీ ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎవరు బిగ్ బాస్ షో విజేతగా నిలుస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ముగ్గురూ అర్హులేనని అయితే ఎవరు విన్నర్ అవుతారో కచ్చితంగా చెప్పలేమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అమర్ దీప్ కు( Amardeep ) ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల చాలామంది ప్రేక్షకుల్లో అతనిపై సింపతీ ఏర్పడుతోంది.బిగ్ బాస్ హౌస్ లో కూడా కొంతమంది అమర్ దీప్ ను టార్గెట్ చేయడంతో ప్రేక్షకుల్లో అమర్ పై సానుభూతి ఏర్పడుతోంది.ఉల్టా పుల్టా పేరుతో బిగ్ బాస్ చేసిన ప్రయోగాలు ఈ షోకు కొంతమేర ప్లస్ అయ్యాయి.

బిగ్ బాస్ షో మరింత సక్సెస్ సాధించాలని మరి కొందరు కామెంట్లు చేసున్నారు.

బిగ్ బాస్ షోను వీక్ డేస్ లో రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయడం కూడా ఈ షోకు వరమైంది.బిగ్ బాస్ షోను మరికొన్ని వారాల పాటు పొడిగించాలని బిగ్ బాస్ టీం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

స్టార్ మా ఛానెల్ కు మాత్రం ఈ షో ఊహించని స్థాయిలో కలిసొచ్చిందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube