బర్త్ డే బ్లాస్ట్.. ఆసక్తికర విజువల్స్ తో ఊహించని వీడియో.. వేర్ ఈజ్ 'పుష్ప'రాజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”పుష్ప 2”.ఈ సినిమా కోసం మోస్ట్ అవైటెడ్ గా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

 Allu Arjun Pushpa 2 Announcement Glimpse, Pushpa 2 Glimpse, Allu Arjun, Pushpa 2-TeluguStop.com

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ ఘన విజయం సాధించింది.ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం అందుకుంది.

దీంతో పార్ట్ 2 పుష్ప ది రూల్ ( Pushpa: The Rule ) ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను బడ్జెట్ పరంగా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాపై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది.ఇదిలా ఉండగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ తన పుట్టిన రోజును జరుపు కుంటున్నారు.

ఈసారి అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడున వచ్చే బ్లాస్టింగ్ అప్డేట్ కోసం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ( Allu Arjun Fans ) అంతా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే మేకర్స్ కూడా నిన్న అఫిషియల్ గా ఈ రోజు అప్డేట్ ఇస్తున్నట్టు ప్రకటించింది.అన్నట్టుగానే ఈ రోజు ఉదయం ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ వీడియోను ( Pushpa 2 Glimpse ) ఫ్యాన్స్ ఎవ్వరూ ఊహించని అప్డేట్ ను అందించారు.

ఈ రోజు ఈ సినిమా నుండి పలు ఆసక్తికర విజువల్స్ తో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ వీడియో మొత్తం అందరిని ఆకట్టు కుంటుంది.ఇందులో ”పుష్పరాజ్ జైలు నుండి తప్పించుకుని పరారీలో ఉన్నట్టు చూపించారు.

అలాగే పుష్పరాజ్ ఎక్కడ అంటూ రిలీజ్ చేసిన కొన్ని సెకండ్ల వీడియో గ్లిమ్స్ ఆసక్తి రేకెత్తించడమే కాకుండా అంచనాలు మరింత పెంచేసింది.దీనిపై పూర్తి క్లారిటీ ఏప్రిల్ 7న సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు మరో అప్డేట్ తో అందిస్తామని చెప్పారు.

మరి కొంత సమయం ఓపిక పడితే మరో బిగ్ అప్డేట్ ఏంటో తెలిసిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube