ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.ఈయన గురించి తెలియని సినీ ప్రేక్షకుడు లేరు.
అంతలా ఈయన తన నటనతో ఆకట్టుకున్నాడు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోల లిష్టులో చేరిపోయాడు.
అయితే పుష్ప కంటే ముందు ఈయనకు కేవలం సౌత్ లో మాత్రమే ఫాలోయింగ్ ఉంది.అయితే ఇప్పుడు అలా కాదు.
ఈయనకు రోజురోజుకూ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ తో డైరెక్టర్ హరీష్ శంకర్ భేటీ అయ్యారు.
ఇందుకు కారణం తెలియదు కానీ వీరి భేటీ జరిగిన తర్వాత అల్లు అర్జు హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే (దువ్వాడ జగన్నాథం) సినిమ చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా నిన్నటితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
దీంతో వీరిద్దరూ మళ్ళీ నిన్న ఈ సందర్భంగా మీట్ అయ్యారు.
ఈ మీట్ తర్వాత హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేసారు.
ఈ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి.ఈ భేటీకి కారణం ఏంటా అని ఫ్యాన్స్ ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.
నిన్న భేటీ అయ్యి కొంత సమయం పాత విషయాల గురించి మాట్లాడు కున్నారు.ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఇక ప్రెసెంట్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు.ఈయనతో కలిసి భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించారు.ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.ఇక అల్లము అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు.ఈ సినిమా ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపు కుంటుంది.ఆగష్టు లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు సమాచారం.