టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో( Pushpa 2 ) నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.వయసుతో సంబంధం లేకుండా అల్లు అర్జున్ ని అభిమానిస్తూ ఉంటారు.
అల్లు అర్జున్ కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ని పిచ్చిగా అభిమానించే ఒక చిన్నారి తన చివరి కోరిక కూడా తీయకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు.ఇంతకీ ఆ అభిమాని ఎవరు? అతనికి ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే… కృష్ణా జిల్లా ఇందుపల్లికి చెందిన 12 ఏళ్ల శ్రీ వాసుదేవ( Sri Vasudeva ) అల్లు అర్జున్ కు వీరాభిమాని.అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్స్ అంటే ఆ యువకుడికి చాలా ఇష్టం.
అయితే ఎక్కువ రోజులు ఆ బాబు బ్రతకడు అని తెలుసుకున్న అల్లు అర్జున ఆ బాబును కలిసి చివరి కోరిక తీర్చాలని అనుకున్నాడు.
చికిత్స నిమిత్తం హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న బాలుడిని పరామర్శించేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్న సమయంలో ఆసుపత్రిలో శ్రీవాసుదేవ చివరి కోరిక తీరకుండానే మృతి చెందాడు.ఇక అతన్ని చూసేందుకు వెళ్ళడానికి సిద్దమైన అల్లు అర్జున్ ఈ విషయం తెలిసి తల్లడిల్లిపోయాడు.ఆ బాలుడి చివరి కోరిక తీర్చలేక పోయానని బాధ పడినట్లు తెలుస్తోంది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది బాధని వ్యక్తం చేస్తున్నారు.ఆఖరి కోరిక అయినా తీర్చలేకపోయారు కానీ కనీసం ఆఖరి చూపు చూసి తల్లిదండ్రులకు ధైర్యం చెబితే బాగుంటుంది అని కొందరు సలహా ఇస్తున్నారు.
ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.