కన్న కొడుకును కర్రతో కొట్టి చంపాడు ఓ తండ్రి.కొడుకు తాగి ఇంటికి రావడంతో తండ్రి వాగ్వాదానికి దిగడంతో ఈ ఘటన సంభవించింది.
తాగిన మైకంలో ఉన్న కొడుకును కర్రతో తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.కొడుకు మరణించాడని తెలిసి భయాందోళనకు గురైన తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నాగారాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సూర్యపేట జిల్లా నాగారం మండలంలో విషాదం చోటు చేసుకుంది.
పస్తాల గ్రామానికి చెందిన బండగొర్ల శ్రీశైలం మద్యానికి బానిసయ్యాడు.దీంతో తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు.
దీంతో తండ్రి ఈదప్పతో గొడవ జరిగేది.నిన్న రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చిన శ్రీశైలం తండ్రి ఈదప్పల మధ్య గొడవ నెలకొంది.
ఇద్దరు వాదించుకుని కూర్చున్నారు.శ్రీశైలం తండ్రి ఈదప్పను కాలుతో తన్నాడు.
దీంతో కోపోధ్రిక్తుడైన ఈదప్ప పక్కనే ఉన్న కర్రను తీసుకుని శ్రీశైలం నెత్తి మీద బలంగా కొట్టాడు.దీంతో శ్రీశైలం తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది.
దీంతో శ్రీశైలం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.కొడుకు మరణించడంతో భయాందోళనకు గురైన ఈదప్ప అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికులు నాగారం పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.కాగా నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.