నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా ఆకాష్ పూరి ‘‘చోర్ బజార్’’ సినిమా ట్రైలర్ విడుదల

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’.గెహన సిప్పీ, నాయికగా నటిస్తోంది.

 Akash Puri, Jeevan Reddy, Vs Raju's Chor Bazaar's Fun-filled Action Trailer Out-TeluguStop.com

దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.ఐ.వి ప్రొడక్షన్స్, పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా అతి త్వరలో థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా ట్రైలర్ ను ఇవాళ నట సింహం బాలకృష్ణ విడుదల చేశారు.తీరిక లేని షెడ్యూల్స్ లోనూ తమ సినిమా ట్రైలర్ విడుదల చేసిన బాలకృష్ణకు చిత్రబృందం థాంక్స్ తెలియజేశారు.

ఈ సందర్భంగా

బాలకృష్ణ మాట్లాడుతూ…చోర్ బజార్ ట్రైలర్ చాలా బాగుంది, టైటిల్ కూడా ఆకట్టుకునేలా ఉంది.పైసా వసూల్ సినిమా నుంచి పూరి జగన్నాథ్ కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడింది.

ఆకాష్ పూరి ఈ సినిమాతో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా.చిత్ర బృందం అందరికీ శుభాకాంక్షలు.

మన తెలుగు వారికి సినిమా కూడా నిత్యావసరమే.కరోనా సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గినా ఆ తర్వాత మళ్లీ మన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.

కొత్తగా, భిన్నంగా ఉన్న చిత్రాలకు అందరి ఆదరణ తప్పకుండా ఉంటుంది.చోర్ బజార్ కూడా అలాంటి కొత్త తరహా సినిమా అవుతుందని ఆశిస్తున్నాను.

అన్నారు.చోర్ బజార్ ట్రైలర్ లో హీరో ఆకాష్ పురి బచ్చన్ సాబ్ అనే క్యారెక్టర్ తో మాస్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నారు.

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఒక దూల ఉంటుంది.నాకు చేతి దూల.20 నిమిషాల్లో 30 టైర్స్ విప్పేస్తా నా దిల్ కా దఢకన్ కోసం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొట్టాలి అంటూ ఆకాష్,చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.ఈ ప్రేమకథకు డైమండ్ మిస్సింగ్ ఎలిమెంట్ పెట్టడం ద్వారా కంప్లీట్ కమర్షియాలిటీ తీసుకొచ్చారు దర్శకుడు జీవన్ రెడ్డి.

సాంకేతిక నిపుణులు –

సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి, సంగీతం – సురేష్, బొబ్బిలి, ఎడిటింగ్ – అన్వర్ అలీ, ప్రభు దేవా, ఆర్ట్ – గాంధీ నడికుడికర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం, సౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి, ఆడియో – లహరి, కాస్ట్యూమ్స్డిజైనర్ – ప్రసన్న దంతులూరి, ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ – భాను,పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను , స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో – జీఎస్కే మీడియా, మేకప్ – శివ, కాస్ట్యూమ్ చీఫ్ – లోకేష్, డిజిటల్ మీడియా,- వాల్స్ అండ్ ట్రెండ్స్, సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ -ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత – వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం – బి.జీవన్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube