10 రోజుల్లో ఆదిపురుష్ @450 కోట్లు.. ఇంకా ఎంత రాబట్టాలంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas, ) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘ఆదిపురుష్’..

 Adipurush Box Office Collections, Adipurush, Prabhas, Saif Ali Khan, Om Raut,-TeluguStop.com

( Adipurush ) రామాయణం ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా జూన్ 16న శుక్రవారం గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మిశ్రమ టాక్ తెచ్చుకుంది.ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

నిన్నటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా 10 రోజులు అవుతుంది.మరి ఈ 10 రోజుల్లో ఆదిపురుష్ సినిమా 450 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

మొదటి మూడు రోజుల్లోనే 350 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ ఆ తర్వాత 7 రోజులకు కలిపి కేవలం ఇన్ని కలెక్షన్స్ నే రాబట్టడం ఈ సినిమా గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్ధం అవుతుంది.అయితే ఇన్ని కోట్లు సాధించిన కూడా ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదనే చెప్పాలి.

Telugu Adipurush, Adipurush Box, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Ali Khan-Mo

ఈ సినిమా మొత్తానికే కలెక్షన్స్ పడిపోవడంతో తిరిగి కోలుకోలేక పోతుంది.తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ఈ 10 రోజుల్లో 84 కోట్ల షేర్ రాగా ఇంకా చాలా రాబట్టాల్సి ఉంది.అలాగే బాలీవుడ్ ( Bollywood ) లో ఈ మూవీ 142 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.అప్పట్లో సాహో మూవీ ( Saaho movie ) 155 కోట్లు రాబట్టగా ఇప్పుడు ఆదిపురుష్ ఈ సినిమాను కూడా బీట్ చేస్తుందో లేదో అనే అనుమానం ఉంది.

Telugu Adipurush, Adipurush Box, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Ali Khan-Mo

అందులోనే అక్కడ 1920 అనే హారర్ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోవడంతో ఆదిపురుష్ మూవీ మొత్తానికే పడిపోయేట్టుగా కనిపిస్తుంది.మొత్తానికి ఈ సినిమా క్లోజింగ్ దిశగా సాగుతుంది.క్లోజ్ అయితే కానీ ఈ సినిమాకు ఎంత మేర నష్టం వాటిల్లుతుందో తెలుస్తుంది.ప్రజెంట్ ఈ సినిమా చూడడానికి మేకర్స్ భారీ ఆఫర్స్ ప్రకటించిన ఎడిట్ చేసి ఎన్ని డైలాగ్స్ మార్చిన చూసే నాధుడే లేడు అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube