నేటి తరం వారికి ఆనాటి అందాల తార ‘రజినీ’ గురించి పెద్దగా తెలియక పోవచ్చు.కానీ మన తల్లిదండ్రులను అడిగితే ఆమె అందం, అభినయం, నటనా కౌశల్యం గురించి పేరాలకు పేరాలు చెబుతారు.
తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో రజినీ టాప్ హీరోయిన్ల లిస్టులో ఉండేది.దిగ్గజ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
ఒక్క తెలుగులోనే కాకుండా, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా రజినీ నటించింది.సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించిన రజినీ ఎంతో మంది అభిమానుల ప్రేమను, ఆదరాభిమానాలను పొందింది.
అయితే, రజినీ సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్న సమయంలోనే ఈమె తల్లిదండ్రులు చూపించిన ఎన్నారై సంబంధాన్ని చేసుకుని సినిమాలకు దూరమైంది.
అయితే, రజినీకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీకి పరిచయమై తన టాలెంట్‌తో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరు హీరోలతో నటించింది.
రజినీ సినీ పరిశ్రమలో ఎలా వచ్చిందనే విషయాన్ని గుర్తుచేసుకుంటే అందరూ ఆశ్చర్యపోతారు.రజినీ ఇంటి పక్కన ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది.అదే సమయంలో షూటింగ్ చూసేందుకు బయటకు వచ్చిన రజినీ అనుకోకుండా ఆ సినిమా దర్శకుడి కంట్లో పడింది.దీంతో ఆమె వివరాలను తన సిబ్బందితో కనుక్కోమని చెప్పి తన తదుపరి సినిమాకు రజినీని హీరోయిన్గా ఎంపిక చేశారట ఆ డైరెక్టర్.
అందుకోసం రజినీ పేరెంట్స్ వద్ద అనుమతి కూడా తీసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు.ఆమెకు అదృష్టం ఎలా పట్టుకుందో.ఈ రకంగా రజినీ మొదట తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.
1985లో ‘బ్రహ్మముడి’ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు రజినీ.తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆమెకు వరుసగా ఆఫర్లు తలుపుతట్టాయి.చాలా బిజీగా మారిపోయింది.
ఇక తల్లిదండ్రులు ఓ ఎన్నారై డాక్టర్ సంబంధం చూడటంతో వారి మాట కాదనలేక పెళ్లి చేసుకుని పూర్తిగా చిత్ర పరిశమ్రకు దూరమయ్యారు ఈ అందాల తార.అయితే, ముగ్గురు పిల్లలు జన్మించాక భర్తతో మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నట్టు తెలిసింది.దీంతో మళ్లీ ఇండియాకు వచ్చి తన ముగ్గురు పిల్లలతో కలిసి బెంగళూరులో హ్యాపీగా సెటిల్ అయ్యిందని తెలుస్తోంది.