Pragathi : సినిమా ఆఫర్లు తగ్గడం వల్లే ప్రగతి అక్కడ ఎంట్రీ ఇచ్చారా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి( Pragathi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Actress Pragathi Entry Into Serials-TeluguStop.com

ఎక్కువగా సినిమాలో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రల్లో నటించి మెప్పించింది ప్రగతి.కాగా ఈమె సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో, సోషల్ మీడియా ద్వారా అంతకు మించి పాపులారిటీని సంపాదించుకుంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Telugu Pragathi, Serials, Tollywood-Movie

సినిమాలలో సాంప్రదాయ పద్ధతిలో కనిపించె ఈమె రియల్ లైఫ్ లో మాత్రం హాట్ గా ఫోజులు ఇస్తూ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.ఈ మధ్య సోషల్‌ మీడియాల్లో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ ట్రెండింగ్‌ పాటలకు స్టెప్పులేస్తూ ఆ వీడియోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వీపరితమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు సంపాదించుకుంటోంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ( Social media )ఈమెకు సంబంధించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

వెండితెర మీద అమ్మ పాత్రలకి పెట్టింది పేరుగా ఉండే ప్రగతి కొన్నాళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు.

Telugu Pragathi, Serials, Tollywood-Movie

జిమ్ వీడియోస్ తో హీరోయిన్స్ కే పోటీ స్తుంది.అయితే ప్రగతి ఇకపై సినిమా అవకాశాలు రావు అనుకుందేమో కానీ ఆమె బుల్లితెర మీద సీరియల్స్ లోకి వచ్చేసింది.ప్రగతి ప్రధాన పాత్రలో ఒక సీరియల్ తెరకెక్కుతోంది.

ఆ సీరియల్ త్వరలోనే ప్రసారమవ్వబోతున్నట్టుగా స్టార్ మా ప్రకటించింది.ఆ సీరియల్ లో ప్రగతి చాలా రిచ్ గా గంభీరంగా పొగరు పట్టిన తల్లి, అత్త పాత్రలో కనిపించబోతుంది.

త్వరలోనే ప్రగతి టీవి సీరియల్ ( TV serial )తో బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతోంది.మరి జగతి ఇప్పటి నుంచి బుల్లితెరకె పరిమితం అవుతుందా లేదంటే వెండితెరపై అవకాశాలు వస్తాయ లేదా అన్నది చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube