సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో అన్నది చెప్పడం చాలా కష్టం.ఎందుకంటే కొంతమంది సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.
ఇంకొందరు మాత్రం సినీ ఇండస్ట్రీకి హిందీ ఇచ్చినప్పటి నుంచి చివరి వరకు కూడా అదే రీతిలో అవకాశాలు కొనసాగిస్తూ దూసుకుపోతూ ఉంటారు.కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా రాణిస్తున్న సమయంలో లగ్జరీగా బతికిన వారు చివరి క్షణాల్లో ఎవరూ లేక అనాధగా చనిపోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు.
కోట్లు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిన వారు ఆఖరి రోజుల్లో అనాధ స్థితిలో చనిపోయిన వారు కూడా ఉన్నారు.ఇంకొందరు మాత్రం నటీనటులు వారి సెలబ్రిటీ హోదాలను పక్కన పెట్టేసి మరి ప్రశాంతమైన జీవితాన్ని గడపడం కోసం సన్యాసులుగా మారిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ కూడా ఈ విధంగానే సన్యాసం లోకి చేరి దేవాలయాల వద్ద భిక్షాటన చేస్తోంది.ఆమె మరెవరో కాదు బాలీవుడ్ వెండితెరపై,బుల్లితెరపై స్టార్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నూపూర్ అలంకార్.
ఇప్పుడు ఆమె సన్యాసిగా మారి ఆలయాల వద్ద బిక్షాటన చేస్తోంది.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా మంచి మంచి సీరియల్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కానీ ఆమె అంత పెద్ద సెలబ్రిటీ హోదాను కూడా వదిలిపెట్టి అందరిని ఆశ్చర్యపరిచే విధంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఆమె సన్యాసినిగా మారింది.ఉత్తర్ ప్రదేశ్ లో పూర్తిగా కాషాయ దుస్తులు ధరించిన ఆమె గోవర్ధన్‌లోని దంఘటి దేవాలయం వద్ద భిక్షాటన చేస్తూ కనిపించింది.గత కొంత కాలంగా తన ఫ్యామిలీ లైఫ్ లో ఇబ్బందులు పడ్డానని,ఆ సమయంలో తన గురువు సూచనతో సన్యాసం తీసుకున్నట్లు నుపూర్ అలంకారం చెప్పుకొచ్చింది.