వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు 'ఎఫ్3' లో మెహ్రీన్ పిర్జాదా రోల్ తన కెరీర్ లోనే ది బెస్ట్ ఎంటర్‌ట్రైనర్‌

బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించే పాత్రలు వినోదానికి కేరాఫ్ అడ్రస్సులుగా అలరిస్తుంటాయి.అలా ప్రేక్షకులకు కావాల్సిన వినోదం పంచిన పాత్రల్లో బ్లాక్ బస్టర్ హిట్ ‘ఎఫ్2’ లో మెహ్రీన్ పిర్జాదా చేసిన హానీ పాత్ర కూడా ముందు వరుసలో వుంటుంది.

 Actress Mehreen Interview Abuout Her Role In F3 Movie Details, Actress Mehreen ,-TeluguStop.com

హనీ మేనరిజం, అమాయకత్వం, అల్లరి ప్రేక్షకుల మనసుని దోచుకున్నాయి.ఇప్పుడు ఎఫ్2 లో హనీ పాత్రకు భిన్నంగా, ఎఫ్2కి మించిన వినోదం ‘ఎఫ్3′ తో పంచబోతున్నారు మెహ్రీన్.ఈ చిత్రంలో మెహ్రీన్ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి.ఎఫ్3 లో మెహ్రీన్ పాత్రని మెచ్యూర్ అండ్ డిఫరెంట్ లేయర్స్ వున్న పాత్రగా పూర్తి వినోదాత్మకంగా రూపొందించారు.ఈ పాత్ర తన కెరీర్ లోనే ది బెస్ట్ ఎంటర్‌ట్రైనర్‌ రోల్ కాబోతుందని మెహ్రీన్ నమ్మకంగా వున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న సూపర్ క్రేజీ ప్రాజెక్ట్ ‘F3’ లో విక్టరీ వెంకటేష్ కి జోడిగా తమన్నా భాటియా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి జోడిగా మెహ్రీన్ నటిస్తుండగా సోనాల్ చౌహాన్ మరో హీరోయిన్ గా అలరించబోతుంది.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

అలాగే సెకెండ్ సింగిల్ ‘వూ.ఆ.ఆహా.ఆహా.ఆహా’ పాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ట్రెండింగ్ లో వుంది.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయబోతున్నారు.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రలలో అలరించనున్నారు.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత.

ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.

తారాగణం:

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌవాన్, పూజా హెగ్డే (స్పెషల్ అప్పీరియన్స్) తదితరులు.

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: అనిల్ రావిపూడి, సమర్పణ: దిల్ రాజు, నిర్మాత : శిరీష్, బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సహా నిర్మాత: హర్షిత్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, డివోపీ: సాయి శ్రీరామ్, ఆర్ట్ : ఎఎస్ ప్రకాష్, ఎడిటర్ : తమ్మిరాజు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్ : ఎస్ కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube