నాపై ఆయన ప్రశంసలు కురిపించారు... జీవితానికి ఇది చాలు: కంగనా

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రౌనత్( Kangana Ranauth ) ఏం మాట్లాడినా కూడా సెన్సేషనల్ అవుతుందనే విషయం మనకు తెలిసిందే.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కంగనా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 He Showered Me With Praise That's Enough For Life , Actress Kangana Ranaut, Vija-TeluguStop.com

ఇక ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుంటాయో మనకు తెలిసిందే.ఏ విషయం అయినా ముక్కుసూటిగా తన అభిప్రాయాలను తెలియజేసే కంగనా తాజాగా తనని ఓ ప్రముఖ రచయిత ప్రశంసించారంటూ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

కంగనా సోషల్ మీడియా వేదికగా తన స్వీయ దర్శకత్వంలో తెరకేక్కిన ఎమర్జెన్సీ సినిమా ( Emergency Movie ) గురించి ఓ పోస్ట్ చేశారు.

Telugu Actresskangana, Bollywood, Emergency-Movie

కంగనా స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలియజేశారు.ఇక ఈ సినిమాని చూసిన మొదటి వ్యక్తి ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ( Vijayendra Prasad ) అని కంగనా తెలియజేశారు.ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆయన పలుమార్లు కంటతడి పెట్టుకున్నారని, సినిమా చూసిన అనంతరం నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తనపై ప్రశంసలు కురిపించారని కంగనా తెలియచేశారు.

ఇలా విజయేంద్ర ప్రసాద్ గారు నాపై ప్రశంసలు కురిపించారు నా జీవితానికి ఇది చాలు అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Telugu Actresskangana, Bollywood, Emergency-Movie

నా గురువులు శ్రేయోభిలాషులతో కలిసి చేసిన ఈ సినిమా ఎట్టకేలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుందని త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నామంటూ కంగనా తెలియజేశారు.ఇక ఈమె విజయేంద్ర ప్రసాద్ రచించిన మణికర్ణిక సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.కంగనా దర్శకత్వంలో వచ్చిన ఎమర్జెన్సీ సినిమా భారత రాజకీయ చరిత్రలో ఓ ప్రధాన ఘట్టమైన ఎమర్జెన్సీ రోజుల నాటి ఆసక్తికర అంశంతో రూపొందిందని, ఇందులో కంగనా ఇందిరా గాంధీ( Indira Gandhi ) పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube