నేడు ఫేమస్ సెలబ్రిటీగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న చాలా మంది నటీనటులు చిన్న చిన్న పాత్రలతోనే కెరీర్ ప్రారంభించారు.వీరిలో కొందరు సినీ తారలు కాకముందు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు.అటువంటి నటులు ఎవరెవరున్నారో తెలుసుకుందాం.
– యష్:
ఇప్పుడంటే భారతీయ సినిమాలో ప్రముఖ స్టార్ గా వెలుగొందుతున్నాడు కానీ యష్( Yash ) ఒకప్పుడు చాలా చిన్న పాత్రలు చేస్తూండేవాడు.వాస్తవానికి అతను సీరియల్స్‌తో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
– మృణాల్ ఠాకూర్:
ఆమె సీతారామం సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది, అయితే ఆమె అప్పటికే హిందీ సీరియల్స్‌లో నటించింది.తెలుగులో ఈ ముద్దుగుమ్మ మరిన్ని సినిమాలు చేస్తోంది.

– విజయ్ సేతుపతి:
తమిళం, తెలుగు సినిమాలలో పనిచేసే బహుముఖ నటుడు, విజయ్ సేతుపతి( Vijay Setupathi ) కూడా తన కెరీర్‌ను సీరియల్స్‌తో ప్రారంభించాడు.

– లావణ్య త్రిపాఠి:
లావణ్య ఒక హిందీ సీరియల్‌లో మొదటగా నటించింది.ఆ తర్వాత తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.త్వరలోనే మెగా కోడలు కూడా అవ్వనుంది.

– షారుఖ్ ఖాన్:
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్( Shahrukh Khan ) కూడా తన కెరీర్‌ను సీరియల్స్‌తో ప్రారంభించాడు.ఇటీవల జవాన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

– విద్యాబాలన్:
ఈ ముద్దుగుమ్మ హమ్ పాంచ్ సీరియల్‌లో నటించింది.ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ గా ఎదిగింది.ఈ తార డర్టీ పిక్చర్ లో నటించి భారతదేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది.

– యామీ గౌతమ్:
ఈ క్యూట్ బ్యూటీ వార్, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి తెలుగు సినిమాలలో పనిచేసిన నటి, కానీ అంతకుముందు ఆమె సీరియల్స్‌లో నటించింది.

– సుశాంత్ సింగ్ రాజ్‌పుత్:
దివంగత బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్( Sushanth Singh Rajput ) తన కెరీర్‌ను సీరియల్స్ నుంచి ప్రారంభించాడు.

– రాధికా మదన్:
రాధికా బాలీవుడ్ నటి, ఆమె హిందీ సీరియల్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది.ప్రస్తుతం ఈ తార ‘ఆకాశం నీ హద్దురా’ హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్ సరసన కథానాయికగా నటిస్తోంది.

– శ్రీ దివ్య:
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఓ సీరియల్‌లో కూడా నటించింది ఈమె.ఇప్పుడు సినిమాల్లో నటిస్తోంది.