బ్లాక్ బస్టర్స్ కి పర్యాయపదంగా మారిపోయారు హీరో ‘శివ కార్తికేయన్‘.ఈరోజు (మే 13, 2022) విడుదలైన శివ కార్తికేయన్ ‘డాన్’ చిత్రం బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ తో సక్సెస్ జర్నీని కొనసాగించింది.
శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన డాన్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.చిత్రానికి ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ స్పందన రావడంతో నిర్మాత, లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుభాస్కరన్, హీరో-నిర్మాత శివకార్తికేయన్‌లు ఆనందం వ్యక్తం చేశారు.
ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ లోకి రప్పించడానికి వేసవి సరైన సమయమని భావించిన నిర్మాతలు, ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.నిర్మాతలు భావించినట్లే ఈ చిత్రానికి మార్నింగ్ షో నుంచే భారీగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కనిపించింది.
శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘డాన్’ చిత్రం ద్వారా శిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయమయ్యారు.శివకార్తికేయన్, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్ జే సూర్యతో ప్రధాన పాత్రలలో కనిపించిన ఈ చిత్రంలో సముద్రఖని, సూరి, బాల శరవణన్, ఆర్ జ విజయ్, శివాంగి, మునిష్కాంత్, కాళీ వెంకట్, రాధా రవి, సింగంపులి, జార్జ్, ఆదిర ఇతర కీలక పాత్రలో కనిపించారు.
సాంకేతిక విభాగం
అనిరుధ్ (సంగీతం), కేఎం భాస్కరన్ (డీవోపీ ) , నాగూరన్ రామచంద్రన్ (ఎడిటర్), ఉదయకుమార్ కె (ఆర్ట్), విక్కీ (స్టంట్స్) సురేన్ జి-ఎస్ అలగైకూతన్ (సౌండ్ డిజైనింగ్-సౌండ్ మిక్సింగ్), విఘ్నేష్ శివన్-రోకేష్ (లిరిక్స్), బృందా-శోబి పాల్ రాజ్-పాపీ-శాండీ (కొరియోగ్రఫీ)అను-హరికేష్-నిత్య-జెఫర్సన్ (కాస్ట్యూమ్ డిజైన్స్), పెర్ముల్ సెల్వం (కస్ట్యూమర్), పి గణపతి (మేకప్), స్టిల్స్ పృథివీరాజన్ ఎన్ (స్టిల్స్), ఎం.మంజునాథన్ (ప్రొడక్షన్ మేనేజర్), సురేష్ చంద్ర-రేఖ డి వన్ (పీఆర్వో), ట్యూనీ జాన్ (పోస్టర్ డిజైనర్), వీరశంకర్ (ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్), తివాకర్ జే ఎఆర్ కార్తీక్-రగుల్ పరశురామ్ (ఎస్కే ప్రొడక్షన్స్), జీకేఎం తమిళకుమారన్ (హెడ్ అఫ్ లైకా ప్రొడక్షన్స్ ), కలై అరసు (సహ నిర్మాత)
.