ఆ ప్రముఖ నటిని నరేష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం.. కానీ?

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన సీనియర్ నరేష్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నటులలో ఒకరనే సంగతి తెలిసిందే.తండ్రి పాత్రలలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలలో నటిస్తూ నరేష్ బిజీగా ఉన్నారు.

 Actor Naresh Pavitra Lokesh Marriage Rumours Goes Viral In Social Media Details,-TeluguStop.com

కామెడీ రోల్స్ లో కూడా అద్భుతంగా నటించే మెప్పించే ప్రతిభ ఉన్న అతికొద్ది మంది నటులలో సీనియర్ నరేష్ ఒకరని చెప్పవచ్చు.అయితే సీనియర్ నరేష్ ప్రముఖ నటి పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

గతంలో వీళ్లిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.తాజాగా వీళ్లిద్దరూ మహాబలేశ్వరం వెళ్లి స్వామీజీని దర్శించుకున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

సీనియర్ నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా భార్యలతో మనస్పర్ధలు రావడం, వేర్వేరు కారణాల వల్ల విడాకులు తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

సీనియర్ నరేష్ వయస్సు 62 సంవత్సరాలు కాగా పవిత్ర లోకేష్ వయస్సు 43 సంవత్సరాలు అని సమాచారం.

Telugu Actresspavitra, Fourth, Naresh, Naresh Fourth, Nareshpavitra, Pavitra Lok

పవిత్ర లోకేష్ చాలా సంవత్సరాల క్రితం శాండిల్ వుడ్ కు చెందిన సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత భర్తతో మనస్పర్ధలు రావడంతో ప్రస్తుతం పవిత్ర లోకేశ్ ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు.అయితే పవిత్ర లోకేశ్ కు కోర్టు నుంచి విడాకులు మంజూరు కావాల్సి ఉందని బోగట్టా.

Telugu Actresspavitra, Fourth, Naresh, Naresh Fourth, Nareshpavitra, Pavitra Lok

సీనియర్ నరేష్ లేదా పవిత్ర లోకేశ్ స్పందించి క్లారిటీ ఇస్తే ఈ వార్తల్లో నిజానిజాలు తేలే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం సీనియర్ నరేష్ విలాసవంతంగా జీవానం గడుపుతున్నారు.సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ పెళ్లికి సంబంధించి భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతుండగా త్వరలో అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

అటు నరేష్ ఇటు పవిత్ర వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube