ఆ ప్రముఖ నటిని నరేష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం.. కానీ?

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన సీనియర్ నరేష్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నటులలో ఒకరనే సంగతి తెలిసిందే.

తండ్రి పాత్రలలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలలో నటిస్తూ నరేష్ బిజీగా ఉన్నారు.

కామెడీ రోల్స్ లో కూడా అద్భుతంగా నటించే మెప్పించే ప్రతిభ ఉన్న అతికొద్ది మంది నటులలో సీనియర్ నరేష్ ఒకరని చెప్పవచ్చు.

అయితే సీనియర్ నరేష్ ప్రముఖ నటి పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

గతంలో వీళ్లిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

తాజాగా వీళ్లిద్దరూ మహాబలేశ్వరం వెళ్లి స్వామీజీని దర్శించుకున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.సీనియర్ నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా భార్యలతో మనస్పర్ధలు రావడం, వేర్వేరు కారణాల వల్ల విడాకులు తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

సీనియర్ నరేష్ వయస్సు 62 సంవత్సరాలు కాగా పవిత్ర లోకేష్ వయస్సు 43 సంవత్సరాలు అని సమాచారం.

"""/" / పవిత్ర లోకేష్ చాలా సంవత్సరాల క్రితం శాండిల్ వుడ్ కు చెందిన సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత భర్తతో మనస్పర్ధలు రావడంతో ప్రస్తుతం పవిత్ర లోకేశ్ ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు.

అయితే పవిత్ర లోకేశ్ కు కోర్టు నుంచి విడాకులు మంజూరు కావాల్సి ఉందని బోగట్టా.

"""/" / సీనియర్ నరేష్ లేదా పవిత్ర లోకేశ్ స్పందించి క్లారిటీ ఇస్తే ఈ వార్తల్లో నిజానిజాలు తేలే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం సీనియర్ నరేష్ విలాసవంతంగా జీవానం గడుపుతున్నారు.సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ పెళ్లికి సంబంధించి భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతుండగా త్వరలో అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

అటు నరేష్ ఇటు పవిత్ర వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ మూవీ తొలిరోజు కలెక్షన్ల లెక్కలివే.. ఫస్ట్ డే రికార్డులు క్రియేట్ చేసిందిగా!