Mistake Review: మిస్టేక్ రివ్యూ: ట్విస్టులతో అదరగొట్టిన డైరెక్టర్?

‘రామ్ అసుర్‌’ సినిమాతో అభిన‌వ్ స‌ర్దార్( Abhinav Sardhar ) మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.ఆయన నటిస్తూ, నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టేక్‌’.

 Mistake Review: మిస్టేక్ రివ్యూ: ట్విస్-TeluguStop.com

( Mistake Movie ) ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి ఈ సినిమాను తెరక్కించాడు.ఈ చిత్రంలో బిగ్ బాస్ అజయ్ మెయిన్ పాత్రలో కనిపించనున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది.మిస్టేక్ కథాకమామీషు ఏంటో ఓ సారి చూద్దాం.

కథ:

మిస్టేక్ సినిమా ముఖ్యంగా మూడు జంటల మధ్య జరుగుతుంది.అగస్త్య (బిగ్ బాస్ అజయ్)-మిత్ర (ప్రియ), కార్తీక్ (తేజ ఐనంపూడి)-స్వీటీ (తానియ కల్ల్రా), దేవ్ (సుజిత్ కుమార్)-పారు (నయన్ సారిక) జంటలకు వచ్చిన సమస్యలు ఏంటి? ఈ మూడు జంటలు ఎందుకు పారిపోవాలని అనుకున్నాయి? పారిపోతోన్న ఈ జంటల మీద అటాక్ చేసిన వ్యక్తి (అభినవ్ సర్దార్) నేపథ్యం ఏంటి? అతను వారిపై ఎందుకు దాడి చేస్తూ ఉంటాడు? ఈ కథలో ప్యాంట్‌కి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ.

నటీనటులు:

అగస్త్యగా బిగ్ బాస్ అజయ్( Bigg Boss Ajay ) నవ్విస్తాడు.యాక్షన్ సీక్వెన్సులో మెప్పిస్తాడు.కార్తీక్‌గా తేజ ఐనంపూడి( Teja Ainampudi ) కనిపించినంత సేపు మెప్పిస్తాడు.దేవ్ కారెక్టర్లో పూజారిలా సుజిత్ కుమార్ చక్కగా నటించాడు.ఈ ముగ్గరి కాంబినేషన్ సీన్లు బాగానే నవ్విస్తాయి.ప్రియ, తానియ, నయన్ ముగ్గురూ చక్కగా నటించారు.

గ్లామర్‌తో ఆకట్టుకుంటారు.మూడు జంటలు తెరపై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి.

ఇక విలన్‌గా అభినవ్ సర్దార్ అందరినీ ఆకట్టుకుంటాడు.ఆహార్యం, నటనలోనూ మెప్పిస్తాడు.

యాక్షన్ సీక్వెన్స్‌లో సూపర్బ్ అనిపిస్తాడు.రాజా రవీంద్ర, సమీర్‌లతో పాటుగా మిగిలిన పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి.

టెక్నికల్:

సాంకేతికంగా ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది.ఇలాంటి సినిమాలకు ఆర్ఆర్ కీ రోల్ పోషిస్తుంటుంది.మ్యూజిక్ పరంగా పాటలు( Songs ) ఓకేన.మాటలు అక్కడక్కడా హద్దులు దాటినట్టు అనిపించినా నవ్విస్తుంటాయి.కెమెరా వర్క్ బాగుంది.ఎడిటింగ్ షార్ప్‌గా అనిపిస్తుంది.

నిర్మాత అభినవ్ ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించినట్టు కనిపిస్తోంది.నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

ఒక పాయింట్ చుట్టూ కథను తిప్పుతూ నవ్వించడం అంటే కత్తి మీద సాము వంటిది.సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ జానర్లను కలిసి ఈ సినిమాను తెరకెక్కించాడు భరత్.అసలు విషయం తెలియనంత వరకు సాఫీగా సాగుతున్నట్టుగానే అనిపిస్తుంది.ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలానే జాలీగా గడుస్తున్నట్టు ఉంటుంది.మూడు జంటలు చేసే కామెడీ, లవ్, సాంగ్స్‌తో అలా వెళ్లిపోతూ ఉంటుంది.వారి మీద అటాక్స్ జరుగుతున్నప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది.ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్:

కథ, ట్విస్ట్ లు, ఫ్రీ క్లైమాక్స్, యాక్షన్స్ సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కాస్త హద్దులు దాటినట్లు అనిపించింది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే.ఈ సినిమా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.పైగా ట్విస్టులతో మాత్రం డైరెక్టర్ బాగా అదరగొట్టాడు.

రేటింగ్: 3/5

.

Mistake Movie Genuine Public Talk

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube