హైదరాబాద్ లోని పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది.మంగలహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగబోలీ ఫర్నిచర్ గోదాంలో నుంచి మంటలు భారీగా చెలరేగాయి.
ఒక్కసారిగా మంటలు, పొగ భారీగా ఎగసిపడటంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అదేవిధంగా ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.