అదా శర్మ.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ నటి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ముద్దు సిన్ హైలెట్ గా నిలిచింది.
ఆ సినిమా చూసిన ప్రేక్షకులు అంత కూడా అదా శర్మ పెద్ద హీరోయిన్ అయిపోతుంది అని.స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అనుకున్నారు.
కానీ ప్రతి సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా నటించడం లేదా.పెళ్లి సీన్స్ లో నటించడం తప్పించి మరొకటి తెలీదు అదా శర్మకు.కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు వచ్చినప్పటికీ అందులో అద్భుతంగా నటించినప్పటికీ ఈ బ్యూటీకి మల్లి టాలీవుడ్ లో ఆ రేంజ్ లో అవకాశాలు రాలేదు.అయితే ఆమె సినిమాల్లో లేకపోయినప్పటికీ ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది.
యాక్టీవ్ గా ఉంటూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొన్ని సార్లు ప్రశంసలు పొందితే మరికొన్ని సార్లు ట్రోల్ అవుతుంది.
ఇటీవల ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలతో అందరిని ఆశ్చర్యపరిచింది.ఇక ఇది అంత పక్కన పెడితే.ఇప్పుడు గాడిద బొమ్మతో ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఆ ఫోటో షేర్ చేస్తూ.”అదా మీద గాడిద.ఎవరినైన గాడిద పిలిచే వారికీ గాడిద గురించి అసలు నిజాలు ఇవి.గాడిదలకు ఎంతో తెలివి ఉంది.జ్ఞాపకశక్తి ఎక్కువ ఉంది.కుక్కలలానే గాడిదలు కూడా సమస్య పరిష్కరించగలవు.గాడిదలు బలమైనవి, నమ్మకమైనవి, ప్రేమగల జీవులు అంటూ గాడిద కథ చెప్పుకొచ్చింది అదా శర్మ.
.