కొంతమంది ఇండస్ట్రీ లో ఎదో ఒకటి అవుదామని ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టం తో దొరికిన ట్రైన్ ఎక్కేసి ఇండస్ట్రీ కి వచ్చేస్తారు.అలా ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్ళు చాలా మండే ఉన్నారు అలాంటి వాళ్లలో వివి వినాయక్( VV Vinayak ) లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా ఉన్నారు.
అయితే అప్పట్లో ఇండస్ట్రీ కి వచ్చిన చాలా మంది డైరెక్టర్లు అలా వచ్చిన వారే ఉన్నారు…ఇక కొందరు అయితే డైరెక్టర్( Director ) అవుదామని వచ్చి యాక్టర్ అయ్యారు, యాక్టర్ అవుదాం అనుకున్నవాళ్ళు డైరెక్టర్లు అవుతూ ఉంటారు.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న టాప్ డైరెక్టర్ అయిన సుజిత్( Sujeeth ) కెరియర్ మొదట్లో ఆయన యాక్టర్ అవుదామని అనుకున్నారట అందులో భాగంగానే ఆయన ఒక సినిమా లో కూడా నటించడానికి ఆడిషన్ ఇస్తే అక్కడున్న వాళ్ళు కొందరు ఆయన్ని తిట్టారట నీకు యాక్టింగ్ రాదు ఏం రాదు అంటూ అనడం తో అయిన నా గొప్పతనం ఏంటో వీళ్ళకి తెలీదు అని అనుకున్నాడట ఇక మొత్తానికి ఆయన మంచి నటుడు గా ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నాడట అలాగే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేసాడట దాంట్లో ఆయన యాక్టింగ్ ఆయన చూసుకున్నాక ఆరోజు వాళ్ళు అన్నది కరెక్ట్ నాకు యాక్టింగ్ అంత రావడం లేదు అని అనుకోని డైరెక్షన్ చేద్దాం అని డైరెక్షన్ సైడ్ వచ్చాడట…
లేకపోతే సుజిత్ ని ఒక మంచి యాక్టర్ గా మనం చూసేవాళ్ళం అయినా కూడా ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేస్తున్న సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారి షేక్ చేయాలనీ చూస్తున్నాడు…
.