నాగ చైతన్య ( Naga Chaitanya )హీరో గా కృతి శెట్టి ( Kriti Shetty )హీరోయిన్ గా నటించిన సినిమా కస్టడీ( Custody )….ఈ సినిమా తమిళం లో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వెంకట్ ప్రభు( Venkat Prabhu ) డైరెక్షన్ లో వచ్చింది… ఈ మూవీ బాక్స్ ఆఫీస్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేక పోయింది అయిన కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాదు తమిళం లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ ఆడియన్స్ ను కూడా మెప్పించలేక పోయింది.
దాంతో బాక్స్ ఆఫీస్ రిజల్ట్ డిజాస్టర్ అయ్యింది అని చెప్పాలి.టోటల్ రన్ లో సినిమా.
బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల టార్గెట్ కి కేవలం 7.20 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 17.80 కోట్ల లాస్ ను సొంతం చేసుకుంది.ఇలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని త్వరగానే కంప్లీట్ చేసుకుని రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది.
అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime )లో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా అక్కడ రెస్పాన్స్ కొంచం బెటర్ గా ఉండగా సినిమాకి వ్యూవర్ షిప్ కూడా ఎక్స్ లెంట్ గా ఉందని తెలుస్తుంది.డిజిటల్ లో రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా సినిమా అక్కడ టాప్ ప్లేస్ లో.
ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.ఇక్కడ రెస్పాన్స్ కూడా డీసెంట్ గానే ఉండటంతో వ్యూవర్ షిప్ ఎక్స్ లెంట్ గా ఉందని సమాచారం.ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన కస్టడీ ఇక్కడ డిజిటల్ లో మాత్రం అదరగొడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…ఇక తెలుగు లో నాగ చైతన్య నటించిన చాలా సినిమాలు తెలుగులో వరుసగా ప్లాప్ అవుతున్నాయి.