బాధలో ఉన్న వారికి ప్రేమగా ఓ కౌగలింత.. గంటకు రూ.7 వేల ఫీజు

ఇప్పటివరకు మీరు డాక్టర్లు, ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, వ్యాపారవేత్తలు ఇలా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను చూసి ఉండాలి.అయితే, మీరు ఎప్పుడైనా ఒక ప్రొఫెషనల్ కౌగిలింత గురించి విన్నారా? వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ దీనికంటూ ఓ ప్రొఫెషన్ ఉంది.బ్రిటన్‌కు చెందిన ట్రెవర్ హూటన్ (30), ఒక ప్రొఫెషనల్ కౌగిలింత అందించే వ్యక్తిగా పేరొందాడు.అతను ప్రజలు సురక్షితంగా మరియు ప్రశాంతంగా ఉండటానికి ఒక గంట పాటు కౌగిలింత కోసం రూ.7,000 ఛార్జ్ చేస్తున్నాడు.దీని కోసం చాలా మంది క్యూలో నిలబడి ఉన్నారంటే ఆశ్చర్యం పోనవసరం లేదు.

 A Loving Hug For Those Who Are Suffering Rs.7 Thousand Fee Per Hour , Hug, 7000-TeluguStop.com

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌ ప్రాంతంలో కొన్ని నెలల క్రితం కడల్ థెరపీ (కౌగిలింత వైద్యం) ప్రారంభమైంది.

ట్రెవర్ హూటన్ అనే యువకుడు ఇందులో సిద్ధహస్తుడు.ఇందులో భాగంగా ఒంటరితనంతో బాధపడే వారికి అతడు వెళ్లి కౌగలింత ఇస్తాడు.

అలా వారిలో డిప్రెషన్ పోగొడతాడు.బాధలో ఉన్నప్పుడు ఎవరి వల్లనైనా సాంత్వన దొరికితే, ఆ బాధల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.

ఫలితంగా ఆత్మహత్యకు ప్రయత్నించే వారు కూడా తమ ఆలోచన విరమించుకుంటారు.దీనినే ఓ వృత్తిగా కొందరు మార్చుకున్నట్లు ట్రెవర్ హూటన్ వెల్లడించాడు.

తాము కేవలం ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తామని చెప్పాడు.అయితే తాము కౌగలించుకున్నప్పుడు కొందరు తమ పనిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నాడు.

కొందరు దీనిని సెక్స్ వర్క్ అని కూడా తప్పుగా భావించారని తెలిపాడు.అలాంటి పరిస్థితులు ఎదురైతే తాము థెరపీ సెషన్ ముగించేసి, వెళ్లిపోతామని వివరించాడు.

కొంతమందికి మొదట్లో ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని, అయితే ఎదుటి వారి బాధలను పోగొట్టడంతో పాటు డబ్బు కూడా దొరుకుతుందని తెలిపాడు.గంటకు 75 పౌండ్లు (భారత కరెన్సీలో రూ.70 వేలు) ఛార్జ్ చేస్తామని పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube