ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది.నాగార్జునసాగర్ నీటి వివాదం నేపథ్యంలో కేంద్రం ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల పంపకాలపై చర్చ జరుగుతుంది.కాగా ఈ అత్యవసర భేటీకి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్స్ వర్చువల్ గా హాజరయ్యారు.
అటు కేంద్ర జలసంఘం ఛైర్మన్, కేఆర్ఎంబీ ఛైర్మన్ నేరుగా హాజరయ్యారు.నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై చర్చించనున్నారు.
గత మూడు, నాలుగు రోజులుగా నాగార్జునసాగర్ ఉద్రిక్తతలను కేంద్రం సీరియస్ గా తీసుకుంది.ఈ క్రమంలోనే ప్రాజెక్టులను సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ భద్రతపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.