యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్విరామంగా షూట్ చేస్తూ చెమటోడుస్తున్నాడు.సంక్రాంతి సీజన్ కే వస్తున్నట్టు అన్నౌన్స్ చేయడంతో స్పీడ్ విపరీతంగా పెంచేసింది నాన్నకు ప్రేమతో యూనిట్.
టాకి పార్ట్ ముగింపు దశలో ఉన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం స్పేయిన్ లో జరుగుతోంది.ఆ తరువాత ఐటం సాంగ్ ని షూట్ చేస్తారట.
సుకుమార్ సినిమాల్లో ఐటం సాంగ్ ఎంత స్పెషల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఎప్పటిలాగే ఈసారి కూడా అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడట దేవిశ్రీప్రసాద్.
ఈ పాటని ఒక బీచ్ లో షూట్ చేస్తారట.అసలు బీచ్ లో మామూలు పాట అంటేనే యవతకు అదో ఊపు, అలాంటిది ఈసారి ఏకంగా బీచ్ లో ఐటం సాంగ్ ప్లాన్ చేసాడు సుకుమార్.
రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు కెమరా బాధ్యతలు చూసుకుంటున్నారు.బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత.డిసెంబరు రెండొవ వారంలో ఆడియో రిలీజ్ చేసి, చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.