చరణ్‌ షాకింగ్‌ నిర్ణయం

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తాజాగా ‘బ్రూస్‌లీ’ సినిమాతో దెబ్బతిన్న విషయం తెల్సిందే.ఈయన తర్వాత సినిమాను కూడా ఒక ఫ్లాప్‌ దర్శకుడితో చేయబోతున్నాడు.

‘కిక్‌ 2’తో ఫ్లాప్‌ అయిన సురేందర్‌ రెడ్డి దర్శత్వంలో చరణ్‌ తమిళ మూవీ ‘తని వరువన్‌’ రీమేక్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాడు.ప్రస్తుతం రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

వచ్చే నెలలో సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయి.ఇక ఈ సినిమా తర్వాత చరణ్‌ ఒక యువ దర్శకుడితో కలిసి వర్క్‌ చేయాలని సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు.

గోపీచంద్‌తో ‘జిల్‌’ అనే స్టైలిష్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఒక లవ్‌ స్టోరీ సినిమాలో నటించాలని భావిస్తున్నాడు.అందుకోసం రాధాకృష్ణ ఒక స్క్రిప్ట్‌ కూడా రెడీ చేసే పనిలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

Advertisement

వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయని అంటున్నారు.‘బ్రూస్‌లీ’ ఫలితం దెబ్బ తీయడంతో చరణ్‌ ఇకపై తన సినిమాల బడ్జెట్‌ను పరిమితిలో ఉంచుకోవాలని నిర్ణయించాడు.

అందులో భాగంగా కొత్త దర్శకులతో వర్క్‌ చేసేందుకు చరణ్‌ ఆసక్తి చూపుతున్నాడు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు