నెలాఖరులో యాకూబ్‌ చరమాంకం

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పందొమ్మిదివందల తొంభైమూడో సంవత్సరంలో సీరియల్‌ బాంబు పేలుళ్ల సూత్రధారి, పేరుమోసిన ఉగ్రవాది యాకూబ్‌ మెమన్‌కు చరమాంకం ఖరారైంది.తన మరణశిక్ష తీర్పును పునఃపరిశీలించి దాన్ని రద్దు చేయాలని యాకూబ్‌ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం తోసిపుచ్చింది.

 Yakub Memon To Hang On July 30-TeluguStop.com

దీంతో ఈ నెల (జూలై) ముప్పయ్యో తేదీన అతన్ని ఉరి తీసేందుకు రంగం సిద్ధమైంది.రెండొందల యాభై మంది చనిపోయిన ఆ బాంబు పేలుళ్ల కేసులో మరణ శిక్షకు గురవుతున్న మొదటి దోషి యాకూబ్‌ మెమన్‌.

యాభై మూడేళ్ల ఈ ఉగ్రవాదిని రెండువేల ఏడో సంవత్సరంలో కోర్టు దోషిగా ప్రకటించింది.రెండు దశాబ్దాలు ఇతను జైల్లో ఉన్నాడు.

ఈ బాంబు పేలుళ్ల కేసులో సోదరులు ఎస్సా, యూసూఫ్‌, వదిన రుబినా కూడా దోషులే.యాకూబ్‌ను నాగపూర్‌ జైల్లోగాని, ఎరవాడ జైల్లోగాని ఉరి తీస్తారు.

ముంబై బాంబు పేలుళ్ల వెనుక ఉన్న మాస్టర్‌ మైండ్స్ యాకూబ్‌ సోదరుడు ఇబ్రహీం (టైగర్‌ మెమన్‌), దావూద్‌ ఇబ్రహీం.పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్‌ గురును ఉరి తీసిన తరువాత అమలు చేస్తున్న మరణ శిక్ష ఇదే కావొచ్చు.

యాకూబ్‌ మెమన్‌ ఉరిశిక్ష గురించి మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు తెలియచేశారు.యాకూబ్‌ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు.

మెమన్‌ ఉగ్రవాదే కావొచ్చు.కాని విద్యాధికుడు.

ఇంగ్లిష్‌ లిటరేచర్లో, పొలిటికల్‌ సైన్‌్సలో పీజీ చేశాడు.ప్రపంచంలోని అనేక దేశాలు మరణ శిక్షను రద్దు చేశాయి.

కాని భారత్‌లో మాత్రం మరో మరణ శిక్ష అమలు జరగబోతున్నది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube